ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6000 పోస్టులతో మరికొద్ది రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో టెట్ మరియు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆమోదం తెలపనున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) , మరియు డీఎస్సీని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిఈడి మరియు బిఈడి పూర్తి చేసి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త గా చెప్పవచ్చు.
ముందుగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి టెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. టెట్ కు అప్లై చేసుకునే అభ్యర్థులను ఆధారంగా చేసుకుని పరీక్షల షెడ్యూల్ నిర్ణయించడం జరుగుతుంది. దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకు 10 నుంచి 15 రోజులు సమయం పడుతుంది. గతంలో 2018లో చివరిసారిగా 7,902 పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు టెట్ మరియు డీఎస్సీ రెండు కలిపి వంద మార్కులకు నిర్వహించారు. ఈసారి మాత్రం టెట్ మరియు డీఎస్సీ రెండు విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
ప్రస్తుతం APPSC గ్రూప్ 2 కోర్స్ కేవలం 399/- కే ఇస్తున్నాము.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
6000 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో టెట్ మరియు డీఎస్సీకి ఆమోదం లభించిన తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తారు. ముందుగా టెట్ నిర్వహించి ఫలితాలు విడుదలైన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారు. టెట్ మరియు డీఎస్సీ రెండింటికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే టెట్ మరియు డీఎస్సీ దరఖాస్తులు స్వీకరణ పూర్తయ్యే సమయానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.