Headlines

పెరిగిన APPSC పోస్టులు | APPSC DL Notification 2024 | APPSC Latest News today | APPSC Group 2

ఆంధ్రప్రదేశ్ లో 240 పోస్టులు తో డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి 30-12-2024 తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా మరో 50 పోస్టులను పెంచింది . దీనితో మొత్తం 290 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పెరిగిన పోస్టులు, సిలబస్ , బ్రేకప్ ఖాళీల సమాచారం , అర్హతలు మరియు ఇతర పూర్తి వివరాలతో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

ఇటీవల అందిన తాజా సమాచారం మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య వెయ్యికి చేరే అవకాశం ఉంది, గ్రూప్ 1 ఉద్యోగాలు సంఖ్య కూడా పెరగవచ్చు.

 

ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 , గ్రూప్ 2 , పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు , డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్లు, డిగ్రీ కాలేజ్ లలో లెక్చరర్స్ , ఇంటర్మీడియేట్ కాలేజ్ లలో జూనియర్ లెక్చరర్స్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. 

 

ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

 

గ్రూప్ 1  నోటిఫికేషన్ పూర్తి వివరాలు 

 

గ్రూప్ 2 నోటిఫికేషన్ పూర్తి వివరాలు 

 

పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వివరాలు

 

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ వివరాలు

 

AP కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు

 

ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ / లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి. 

 

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.  

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

 

పోస్టుల పేర్లు : డిగ్రీ లెక్చరర్స్

 

మొత్తం పోస్టుల సంఖ్య : 290 ( 240+50)

 

విద్యార్హత : 

 

జీతము : Rs.57,700/- నుండి 1,82,400/-

 

జోన్ల వారీగా & సబ్జెక్ట్ లు వారిగా ఖాళీలు : జోన్ల వారీగా & సబ్జెక్ట్ లు వారిగా ఖాళీలు వివరాలు దిగువన ఇవ్వబడినవి.

 

ఎంపిక విధానం : పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ఆధారంగా ( కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు )

 

అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-01-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 13-02-2024

 

పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

 

వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ,  బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. మరియు PH అభ్యర్థులకు పదేళ్ల సడలింపు కలదు .

 

ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/-  మరియు పరీక్ష ఫీజు 120/-   

 

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు) 

 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 450 మార్కులకు రెండు పేపర్స్ తో పరీక్ష పెట్టి ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి , ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు . 

 

ఈ పరీక్ష లో మొత్తం 450 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటవ పేపర్ లో 150 ప్రశ్నలు ,150 మార్కులు కు ఇస్తారు. 

 

రెండవ పేపర్ లో 150 ప్రశ్నలు 300 మార్కులు కి ఇస్తారు.  ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.

 

కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫై ఆయితే చాలు. తుది ఎంపికలో ఈ మర్కులు పరిగణలోకి తీసుకోరు.

 

Download Notification

 

Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!