నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి స్టాఫ్ నర్స్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానములో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష , ఇంటర్వూ లేవు. బీఎస్సీ నర్సింగ్ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత వచ్చిన అప్లికేషన్ ఫారం పై అభ్యర్థి సంతకం చేసి, అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జతపరిచి డైరెక్ట్ గా వెళ్లి లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ క్రింద ఇవ్వబడినవి.
మొత్తం ఖాళీల సంఖ్య: ఖాళీలు సంఖ్య నోటిఫికేషన్ లో తెలుపలేదు.
ఎంపిక విధానము : రాత పరీక్ష , ఇంటర్వూ లేవు, మెరిట్ ఆధారంగా ఎంపిక.
ఫీజు : లేదు
అర్హతలు :
- B.SC Nursing లేదా తత్సమానమైన అర్హత
- రాష్ట్ర లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
జీతం: 32,682/-
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాల వరకు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల ప్రకారం ఎస్సీ ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
ఫీజు:
SC , ST అభ్యర్థులకు – 500/-
మిగతా అభ్యర్థులుకు – 1000/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అని అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సిన చిరునామా : ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, రెండవ అంతస్తు, పాత ఓపిడి బ్లాక్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్ – 500082
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-01-2024
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 02-02-2024
అప్లికేషన్ హార్డ్ కాపీ అందజేయాల్సిన చివరి తేదీ : 07-02-2024
అవసరమైన సర్టిఫికెట్లు :
- ఆన్లైన్ అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ
- 10వ తరగతి మార్కుల మెమో
- బిఎస్సి నర్సింగ్ డిగ్రీ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రము
- PH సర్టిఫికెట్
- ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆదాయ ధ్రువీకరణ పత్రము
- ఆరవ తరగతి నుండి బిఎస్సి నర్సింగ్ వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్
- రాష్ట్ర లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్