ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు నైట్ వాచ్ మెన్లు ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. AP లో జూనియర్ కాలేజీలకు నైట్ వాచ్మెన్ లను నియమించడం ఇదే తొలిసారి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు క్రింద అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలలకు నైట్ వాచ్మెన్లను ఇప్పటికే నియమించింది. ఈ తరహాలోనే జూనియర్ కాలేజీలకు నైట్ వాచ్మెన్ లను నియమించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దీని ప్రకారం రాష్ట్రంలోని 460 జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ నియామకాలు చేపట్టబోతున్నారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
గౌరవ వేతనం : 6,000/-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు క్రింద 476 కళాశాలలను అభివృద్ధి చేసింది. ప్రభుత్వం స్కూల్స్ లో మౌళిక సదుపాయాలు కల్పించి, ఫర్నీచర్, IFP స్రీన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ సదుపాయాలు కల్పించింది. వీటికి రక్షణగా నైట్ వాచ్మెన్ లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది , ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికీ 16 కాలేజ్ లలో నైట్ వాచ్మెన్లు ఉండగా, మిగిలిన 460 కాలేజ్ లలో నైట్ వాచ్మెన్లు నియమిస్తారు..
అర్హత : నైట్ వాచ్మెన్ గా ఇప్పటికే అదే కాలేజ్ లో ఆయాగా పనిచేస్తున్న వారి భర్తను గాని , ఆ గ్రామం / వార్డ్ లో నివసిస్తున్న ఎక్స్ సర్వీస్ మెన్ కు గాని అవకాశం ఇవ్వాలని , వీరు ఇద్దరూ లేకపోతే కళాశాల అభివృద్ధి కమిటీ సరైన అభ్యర్థిని నియమించాలని కమిషనర్ ఆదేశించారు.