ఆంధ్రప్రదేశ్ లో హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ | AP Homeguard Jobs Notification 2024 | AP Homegurd Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది. 

 

ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ఎలా ఉంటుంది ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.

 

✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం జిల్లాలో విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన అభ్యర్థుల నుండి హోంగార్డుల నియామకాలు కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ A.రవిశంకర్ గారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. బి కేటగిరి (టెక్నికల్ , ఇతర ట్రేడ్) క్రింద ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోస్టులకు స్త్రీ , పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు

 

నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా పేరు : విశాఖపట్నం జిల్లా

 

మొత్తం ఉద్యోగాలు : 14

 

పోస్టుల పేర్లు : హోం గార్డ్ 

 

అర్హత :

  •  ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  •  BCA / MCA / B.sc ( Computers ) / B.Tech ( Computers ) , లేదా ఇతర ఐటీ నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

 

జీతము : రోజుకు 710/- రూపాయలు

 

అప్లికేషన్ చివరి తేదీ: 30-01-2024

 

ఫీజు : లేదు 

 

వయస్సు : 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ / Gmail ద్వారా

 

ఎంపిక విధానము: 

 

  • ఫిబ్రవరి 3వ తేదీన దరఖాస్తులు పరిశీలన
  • ఫిబ్రవరి 4వ తేదీన ఎంపిక పరీక్ష ఉంటుంది.
  • ఫిబ్రవరి 4న సూర్యా భాగ్ పోలీస్ స్టేడియంలో నిర్వహించే ఐటీ మరియు డ్రైవింగ్ పరీక్షతోపాటు 800 మీటర్ల పరుగు పందెం పురుష అభ్యర్థులు అయితే 300 సెకండ్లలోపు, మహిళా అభ్యర్థులు అయితే 200 సెకండ్లలోపు పూర్తి చేయాలి.

 

అవసరమైన సర్టిఫికెట్లు : విద్యార్హత సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రము, లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ విద్యార్హత సర్టిఫికెట్లు, విశాఖ నేటివిటీ సర్టిఫికెట్ మరియు ఇతర సర్టిఫికెట్ల ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో ఫిబ్రవరి 4వ తేదీన హాజరు కావాలి. 

 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం , సూర్యబాగ్ విశాఖపట్నం. (లేదా) [email protected] కు mail చేయవచ్చు.

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!