ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరో శుభవార్త. ప్రస్తుతం భర్తీ చేస్తున్న 897 పోస్టులు కాకుండా మరికొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో కొన్ని పోస్టులను జతపరిచి మొత్తం వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగాలకు మొత్తం 4,83,525 అప్లికేషన్స్ వచ్చినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అంటే ఒక్కో పోస్టుకు దాదాపు 539 మంది అభ్యర్థులు పోటుపడుతున్నారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో 897 పోస్టును భర్తీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో మరికొన్ని ఖాళీ పోస్టులు ఉన్నట్లు తేలిన నేపథ్యంలో, ప్రస్తుతం ఖాళీలను కలిపి 1000 పైగా పోస్టులు భర్తీ చేస్తారు అని సమాచారం.
నోటిఫికేషన్ లో ఎప్పటికే తెలియజేసిన ప్రకారమే గ్రూప్-2 ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు కూడా చేస్తుంది. ప్రిలిమినరీ పరీక్ష తేదీలో ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు ఎటువంటి మార్పు లేదు.
ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 , గ్రూప్ 2 , పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు , డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్లు, డిగ్రీ కాలేజ్ లలో లెక్చరర్స్ , జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్లు వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
✅ గ్రూప్ 1 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
గ్రూప్ 2 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వివరాలు
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ వివరాలు
AP కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు
జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వివరాలు
డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ వివరాలు
గ్రూప్ 1 ఉద్యోగాల దరఖాస్తు చివరి తేదీ జనవరి 21వ తేదీతో ముగియనుండగా అభ్యర్థుల నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునేందుకు తేదీని పొడిగించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి . గ్రూప్ 1 ఉద్యోగాల దరఖాస్తు చివరి తేదీ పొడిగింపుకు సంబంధించి ఇప్పటివరకు ఏపీపీఎస్ నుంచి అధికారిక ప్రకటన ఎటువంటిది లేదు.