తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానం లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద సబ్ సెంటర్లుగా మారబోతున్న ఆరోగ్య మరియు సంరక్షక కేంద్రాల్లో అర్బన్ మరియు రూరల్ ఏరియాల్లో MLHP పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా నుండి విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు జనవరి 18వ తేదీ నుండి జనవరి 27వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో రూరల్ ఏరియా లో 03 పోస్టులు, అర్బన్ ఏరియా లో 01 పోస్టు ఉన్నాయి.
అర్హత :
అర్బన్ ఏరియాల్లో – ఎంబిబిఎస్ / BAMS
రూరల్ ఏరియాల్లో –
- ఎంబిబిఎస్ / BAMS (or)
- B.Sc నర్సింగ్ / GNM (2020 కి ముందు పాస్ అయిన వారు బ్రిడ్జి ప్రోగ్రాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నందు చేసి ఉండాలి)
జీతము :
ఎంబిబిఎస్ / BAMS వారికి నెలకు – 40,000/-
స్టాఫ్ నర్స్ లకు – 29,000/-
వయస్సు : 18 నుండి 44 సంవత్సరాలు
వయస్సు సడలింపు : SC , ST, BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఫీజు : 300/-
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఈ ఫీజును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, వనపర్తి జిల్లా పేరుమీద డిడి రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకులో తీయాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
O/o జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, వనపర్తి
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్స్ , సంబంధిత కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ , కుల ధ్రువీకరణ పత్రము మరియు ఒకటి నుండి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, అనుభవ ధ్రువీకరణ పత్రము వంటి సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.