Headlines

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Junior Assistant Jobs Latest Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల ఎంపికలో నిర్వహించే పరీక్ష యొక్క సిలబస్ ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగాల సిలబస్ మాదిరిగానే ఉంటుంది.

 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ డాక్టర్ వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ , విజయవాడ  నుండి విడుదల చేశారు. మొత్తం 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. 

 

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

  • ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

 

  • అప్లై చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తుంది.

 

  • ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ముందుగా ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించి , ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.

 

  • ఈ పరీక్షలు ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించాలా ? లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించాలా ? అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయిస్తుంది.

 

  • ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే 25220/- రూపాయల నుంచి 80,910/- రూపాయలు మధ్య పే స్కేల్ ఉంటుంది.

 

  • ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు అవుతారు.

 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాల సడలింపు ఇస్తారు. అనగా 47 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. 

 

  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు కలదు అనగా 52 సంవత్సరాల వరకు వయసు కలిగిన అప్లై చేయవచ్చు.

 

  • ఎస్సీ ,ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయాలంటే 750 రూపాయలు ఫీజు చెల్లించాలి. 

 

  • మిగతా అభ్యర్థులు 1500 రూపాయలు ఫీజు చెల్లించాలి. 

 

  • అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. 

 

Download Notification

 

▶️ Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!