ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన ఒక కొత్త నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా వైద్యసేవల సమన్వయ అధికారి వారి ఆధ్వర్యంలో గల డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో ఒక సంవత్సరం కాలపరిమితికి నియమించుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జనవరి 17వ తేదీ నుండి జనవరి 31 సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ ను అందజేయాలి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య సేవలు సమన్వయ అధికారి కార్యాలయం, పశ్చిమగోదావరి జిల్లా
మొత్తం ఉద్యోగాలు : 08
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు
పోస్టుల పేర్లు : డాక్టర్, కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్, యోగా తెరపిస్ట్ లేదా డాన్స్ టీచర్, నర్స్, వార్డ్ బాయ్
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయో సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ,ఎస్టీ, బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.
జీతము :
డాక్టర్ – 60,000/- (రూరల్) , 55,000/- (అర్బన్)
కౌన్సిలర్ – 17,500/-
యోగా తెరపిస్ట్ ( పార్ట్ టైం) – 5,000/-
నర్స్ – 15,000/-
వార్డ్ బాయ్ – 13,000/-
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 17-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 31-01-2024
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
పరీక్ష విధానం : పరీక్ష లేదు
ఫీజు : లేదు .
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
ఇంచార్జ్, జిల్లా వైద్యశాల సమన్వయ అధికారి వారి కార్యాలయం, ఏరియా ఆసుపత్రి, తాడేపల్లి, పశ్చిమగోదావరి జిల్లా.
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి