Headlines

AP లో ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Latest Notification | AP Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సంస్థల్లో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది. కాబట్టి ఈ ఉద్యోగాలకి అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి. ఈ 3 ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేసిన ఉమ్మడి నోటిఫికేషన్ ఇది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ లో ఖాళీగా ఉన్న కాంటాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం భర్తీ కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటారు . తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్, అప్లికేషన్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య – 40

ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగాలు 2 , ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు 38 భర్తీ చేస్తున్నారు.

ఒక పోస్ట్ కు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. వేరువేరు పోస్టులకు వేరువేరుగా అప్లై చేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అనగా మరో సంవత్సరం వరకు ఈ సంస్థల్లో ఏమైనా ఖాళీలు ఏర్పడితే నోటిఫికేషన్ ఇవ్వకుండా మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు ను పిలిచి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే భవిష్యత్తులో ఏమైనా ఖాళీలు ఉన్నప్పుడు మంచి మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుంది అని నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.

Download Our APP

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Join Our What’s App Channel

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. చివరి తేదీ 20-01-2024

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం జిల్లా

పోస్టుల పేర్లు : 16 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి

బుక్ బేరర్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రిషన్ గ్రేడ్ 2, స్పీచ్ తెరపిస్ట్, MNO, FNO, పర్సనల్ అసిస్టెంట్ ,జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ లేదా వార్డెన్, అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్, క్లాస్ రూమ్ అటెండెంట్, ఆయా, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్.

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 40 పోస్టులు

అర్హత : 10th, ITI , డిగ్రీ మరియు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి. కొన్ని పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి.( పూర్తి నోటిఫికేషన్ చూడండి )

నోటిఫికేషన్ విడుదల తేదీ: 12-01-2024

అప్లికేషన్ ప్రారంభించేది : 12-01-2024

అప్లికేషన్ చివరి తేదీ : 20-01-2024

సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 05-02-2024

కౌన్సెలింగ్ జరిగే తేదీ : 06-02-2024

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 06-02-2024

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

పరీక్ష విధానం : పరీక్ష లేదు

ఫీజు : కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మదనపల్లి, అన్నమయ్య జిల్లా పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీయాలి

OC అభ్యర్థులకు 250/- రూపాయలు .

SC , ST, BC, PH అభ్యర్థులకు అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ నింపి సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలను జతపరిచి అప్లై చేయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , శ్రీకాకుళం జిల్లా

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!