ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ శాఖల్లో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కోసం APPSC నుండి 07-12-2023 తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీకు తెల్సిందే.
ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 331 , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి.
నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు జనవరి 10వ తేదితో చివరి తేదీ ముగిసింది. కొన్ని రకాల సాంకేతిక కారణాల వలన చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోలేకపోయారు.. అభ్యర్థుల నుండి ఎక్కువ సంఖ్యలో వచ్చిన విజ్ఞప్తుల మేరకు APPSC గ్రూప్ – 2 ఉద్యోగాలకు అప్లికేషన్ చివరి తేదీ జనవరి 17 వరకు పొడిగించింది. ఈ మేరకు APPSC వెబ్ నోటీస్ విడుదల చేసింది. అలాగే నోటిఫికేషన్ లో ముందుగా తెలిపిన ప్రకారమే ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ ఖచ్చితంగా నిర్వహించబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు స్వీకరణ గత నెల 21 నుండి ప్రారంభం కాగా ఇప్పటి వరకు ఈ పోస్టులకు 4 లక్షల మందికి పైగానే అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ లెక్క ప్రకారం ఒక్కో పోస్టుకు 446 మందికి పైగానే అప్లికేషన్ పెట్టుకున్నారు. దరఖాస్తు స్వీకరణ సమయం ముగిసే సమయానికి అభ్యర్థుల నుంచి భారీ సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోస్టులకు భారీ పోటీ ఉంటుంది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
త్వరలో APPSC నుండి AP ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు , వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు అయిన పరిగే సుధీర్ గారు తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలిపారు.