తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో దాదాపు 6,000 పోస్టులు భర్తికి నోటిఫికేషన్స్ విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగ ఖాళీలతో సిద్ధమవుతున్నాయి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో tపోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఏ కేడర్ లో ఎన్ని పోస్ట్లు మంజూరు అయ్యాయి ? ఎంత మంది పని చేస్తున్నారు ? ఎన్ని ఖాళీలు ఉన్నాయి ? అనే వివరాలు ఈనెల 8వ తేదీలోగా పంపించాలని సంబంధిత డిపార్ట్మెంట్ల హెచ్వైడీలకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలతో హెచ్వోడీలు నివేదికలు సిద్ధం చేశారు.
ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 1420 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు గత రెండేళ్లలో ప్రారంభమయ్యాయి. మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు త్వరగా భర్తీ చేయాలని భావిస్తున్నారు.
వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉండే జిల్లా ఆస్పత్రిలు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు మరియు నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఉండే పల్లె దవాఖానాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 6000 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇందులో సుమారు 3000 డాక్టర్ పోస్టులు తో పాటు 3000 పారామెడికల్ మరియు ఇతర అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఉండే అవకాశం ఉంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..