ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, కనుక ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష ఉండదు. కేవలం అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు గతంలో పనిచేసిన అనుభవం ఉంటే ఆ సర్టిఫికెట్ అప్లికేషన్ తో పాటు జతపరిచి అప్లై చేసిన అభ్యర్థులకు వెయిటేజీ మార్కులు కలిపి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ వైద్య సంస్థల్లో అవసరమైన సిబ్బందిని నియమించడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులు స్థానికులకు 20 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు.
పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా మరియు ఇతర విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
ఇందులో ఎక్కువ మంది అప్లై చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మరియు ఇతర అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 94 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 32 రకాలు భర్తీ చేస్తుండగా , ఇందులో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ ను కర్నూలు మెడికల్ కాలేజ్ నుండి విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలులో ఉన్న ప్రాంతీయ కంటి ఆసుపత్రి తో పాటు కర్నూలు నంద్యాల , ఆదోనిలలో ఉన్న ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిల్లో ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టే అభ్యర్థులు జనవరి 2 నుండి జనవరి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులను కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో అందజేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఇవే
జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ , వార్డెన్ (ఫిమేల్), క్లాస్ రూమ్ అటెండెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్, మౌల్డ్ టెక్నీషియన్, OT అసిస్టంట్, ENMG, EEG, ఆర్థోటెక్నీషియన్, ఆర్తోటిస్ట్, ప్రోస్తేటిక్ టెక్నీషియన్, ప్రోస్తేటిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ , రిసెప్షనిస్ట్ కం క్లర్క్, డ్రైవర్, పెయింటర్, వైర్ మాన్, కార్పెంటర్ , స్ట్రెచర్ బేరర్, హౌస్ కీపర్, బార్బర్, హెల్పర్, లస్కర్, లిఫ్ట్ అటెండెంట్ , పంప్ మాన్, షూ మేకర్, వ్యాన్ అటెండెంట్, యానిమల్ అటెండెంట్, గార్డినర్, దోబి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ప్రిన్సిపల్ , కర్నూలు మెడికల్ కాలేజ్ , కర్నూలు అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి రూపంలో ఫీజు చెల్లించాలి.
ఓసి అభ్యర్థులు అయితే 250/- ఫీజు చెల్లించాలి. మిగతా అభ్యర్థులు 200/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేస్తారు