Headlines

ఏపీపీఎస్సీ నుండి 240 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APPSC DL Notification 2023-24

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ రోజు మరో నోటిఫికేషన్ విడుదల చేశారు . 

కొన్ని సంవత్సరాల తరువాత ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 , గ్రూప్ 2 , పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు , డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్లు , ఇంటర్మీడియట్ కాలేజ్ లలో జూనియర్ లెక్చరర్స్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వివరాలు 

ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ / లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి. 

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.  

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

🔥 పోస్టుల పేర్లు :  డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 240

01)  వృక్షశాస్త్రం – 19

02)  కెమిస్ట్రీ – 26

03)  వాణిజ్యం – 35

04)  కంప్యూటర్ అప్లికేషన్స్ – 26

05)  కంప్యూటర్ సైన్స్ – 31

06)  ఆర్థిక శాస్త్రం – 16

07)  చరిత్ర – 19

08)  గణితం – 17

09) భౌతిక శాస్త్రం – 11

10) రాజకీయ శాస్త్రం – 21

11) జంతుశాస్త్రం – 19

🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ఆధారంగా ( కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు )

🔥 అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-01-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 13-02-2024

🔥 పరీక్ష తేదీ : ఏప్రిల్ / మే 2024 లో 

🔥 జీతము : 57,100/- నుండి 1,47,760/-

🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ,  బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. మరియు PH అభ్యర్థులకు పదేళ్ల సడలింపు కలదు .

🔥 ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/-  మరియు పరీక్ష ఫీజు 120/-   

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు) 

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 450 మార్కులకు రెండు పేపర్స్ తో పరీక్ష పెట్టి ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి , ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు . ఈ కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 

ఈ పరీక్ష లో మొత్తం 450 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటవ పేపర్ లో 150 ప్రశ్నలు ,150 మార్కులు కు ఇస్తారు. 

రెండవ పేపర్లో 150 ప్రశ్నలు 300 మార్కులు కి ఇస్తారు.  ప్రతి తప్పు సమాధానానికి 1/3 రుణాత్మక మార్కింగ్ విధానం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!