Headlines

7,094 పోస్టులకు ఎంపికలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ | TS Staff Nurse Jobs Provisional Merit List | TS Staff nurse jobs Certificate Verification

తెలంగాణలో స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు మరొక శుభవార్త. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఈరోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీ కోసం 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసి 2023 ఆగస్టు 2వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్షను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించడం జరిగింది.

ఈ పరీక్షను మొత్తం మూడు షిఫ్టుల్లో నిర్వహించారు.

పరీక్ష నిర్వహించిన కొద్ది రోజులకి ప్రిలిమినరీ ” కి ” ని విడుదల చేసిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు , ఈర నేల 18న అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఫలితాలను కూడా విడుదల చేసింది. 

అభ్యర్థులు తమ యూజర్ నేమ్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి తమకు వచ్చిన మార్కులను తెలుసుకున్నారు.. అభ్యర్థులకు వారు రాసిన షిఫ్ట్ లో వచ్చిన మార్కులు , నార్మలైజేషన్ తర్వాత వారి మార్కులు , గతంలో వారు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసి ఉంటే ఆ అనుభవానికి వెయిటేజీ మార్కులు కలిపి మొత్తం మార్కులను వెల్లడించారు .

ఈ ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు నుండి అధికారిక వెబ్సైట్ లోనే ఈనెల 20వ తేదీ వరకు స్వీకరించారు.

తెలంగాణ మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తన అధికారిక వెబ్సైట్ లో ఇటీవల పోస్టులను పెంచుతూ జోన్లవారీగా ఖాళీలు వివరాలు తెలియజేస్తూ, రిజర్వేషన్లు , రోస్టర్ పాయింట్స్ వివరాలన్నీ తెలుపుతూ , ఒక వెబ్ నోటీస్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. 

గత సంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో 5,204 పోస్టులు ఉండగా తాజాగా 1890 పోస్టులను జత చేసి మొత్తం 7,094 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లుగా రిక్రూట్మెంట్ బోర్డ్ కొద్ది రోజులు క్రితం తెలిపింది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈరోజు అనగా డిసెంబర్ 28వ తేదీన అధికారిక వెబ్సైట్లో పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క ప్రోవిజినల్ జాబితాను విడుదల చేసిన బోర్డు , ప్రోవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసింది. 

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు దిగువ తెలిపిన అడ్రస్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. 

సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగు ప్రదేశం: 

తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్సైజ్ అకాడమీ (తూర్పు), 120/P, సెయింట్ మైఖేల్స్ కాలనీ, అభ్యుదయ నగర్, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్ 500086.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!