Headlines

UPSC CDS Notification 2024 in Telugu | UPSC CDS Recruitment 2024 Qualification, Age, Eligibility, Selection Process

భారతదేశంలో త్రివిధ దళాల్లో పని చేయాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం. 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ( 2024 ) నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అవివివాహిత పురుష మరియు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

మొత్తం ఖాళీల సంఖ్య: 457

ఎంపిక విధానము : రాత పరీక్ష , ఇంటర్వ్యూ మరియు వైద్య పరీక్షల ఆధారంగా

ఫీజు : 200/-

SC / ST / మహిళా అభ్యర్థులు లకు ఫీజు లేదు. 

అర్హతలు : 

మిలటరీ అకాడమీ మరియు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. 

నావెల్ అకాడమీ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వారు అర్హులవుతారు. 

ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఇంటర్ లో మ్యాథ్స్ , ఫిజిక్స్ సబ్జెక్టులు కలిగి ఉండాలి. 

ఓటిఏ ఎస్ఎస్సి నాన్ టెక్నికల్ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అవుతారు. 

చివరి సంవత్సరం చదివి పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

వయస్సు : 

కనీసం 20 సంవత్సరాలు నుండి 24 సంవత్సరాల వరకు ( 01-01-2024 నాటికి )

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. అర్హులైన పురుష మరియు మహిళా అభ్యర్థులు 2024లో జనవరి 9 వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. 

అభ్యర్థి ఈ పోస్టులకు అప్లై చేసే సమయంలో ఏమైనా తప్పులు చేసినట్లయితే 2024లో జనవరి 10 నుండి జనవరి 16 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ను  సవరించుకునే అవకాశం ఇస్తారు.

ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా పరీక్షను 2024లో ఏప్రిల్ 21వ తేదీన నిర్వహిస్తారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!