కాంటాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశం . ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు నర్సింగ్ కాలేజ్ లలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేసిన ఉమ్మడి నోటిఫికేషన్ ఇది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య – 94.
ఒక పోస్ట్ కు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వైద్య , ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా 94 పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ డిపార్ట్మెంట్ అవసరాలు మేరకు ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 21వ తేదీ నుండి డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు అప్లై చేయవచ్చు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, గుంటూరు.
🔥 పోస్టుల పేర్లు : 32 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి 👇👇👇
ల్యాబ్ టెక్నీషియన్ , అనస్థీషియా టెక్నీషియన్, బయో మెడికల్ టెక్నీషియన్, CT టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, రేడియో సేఫ్టీ ఆఫీసర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ , రేడియోగ్రాఫర్, రేడియో థెరపీ టెక్నీషియన్, EMT టెక్నీషియన్ (సీఎం కాన్వాయ్) , ఆఫీస్ సబార్డినేట్ లేదా అటెండర్లు , జనరల్ డ్యూటీ అటెండెన్ట్స్, స్టోర్ కీపర్ , మౌల్డ్ టెక్నీషియన్ (జూనియర్ మరియు సీనియర్), సిస్టం అడ్మినిస్ట్రేటర్ , పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ కం క్లర్క్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ / వార్డెన్స్, క్లాస్ రూమ్ అటెండర్స్, హెవీ వెహికల్ డ్రైవర్స్, డ్రైవర్స్ (సీఎం కాన్వాయ్), ఆయా ,ల్యాబ్ అటెండెన్ట్స్ , లైబ్రరీ అటెండెన్ట్స్, OT అసిస్టంట్, ప్లంబర్ .
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 94
🔥 అర్హత : 7th Class , 10th, ఇంటర్, డిగ్రీ మరియు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి. ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ: 21-12-2023
🔥 అప్లికేషన్ ప్రారంభించేది : 21-12-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-12-2023
🔥 సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 29-01-2024
🔥 కౌన్సెలింగ్ జరిగే తేదీ : 06-02-2024
🔥 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 06-02-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు : OC , BC అభ్యర్థులకు 300/- రూపాయలు ,
SC , ST, EWS , PH అభ్యర్థులకు అభ్యర్థులకు ఫీజు లేదు .
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ నింపి అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , గుంటూరు.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍