Headlines

TS Staff Nurse Results Released | TS MHSRB Staff Nurse Results Released | Telangana Staff Nurse Results Update

తెలంగాణలో స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు మరొక శుభవార్త. ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

అభ్యర్థులు తమ యూజర్ నేమ్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి తమకు వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు

తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీ కోసం 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసి 2023 ఆగస్టు 2వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్షను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించడం జరిగింది.

ఈ పరీక్షను మొత్తం మూడు షిఫ్టుల్లో నిర్వహించారు.

పరీక్ష నిర్వహించిన కొద్ది రోజులకి ప్రిలిమినరీ ” కి ” ని విడుదల చేసిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు , ఈరోజు అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఫలితాలను విడుదల చేసింది. 

తాజాగా విడుదల చేసిన వెబ్ నోటీసులో గతంలో విడుదల చేసిన ప్రొవిజినల్ “ కీ “ పై అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించామని , అయితే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ “ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “ కీ కమిటీ ఈ ప్రిలిమినరీ “ కీ “ లేదా ప్రొవిజనల్ “ కి” లో ఎటువంటి మార్పులు లేవని , ప్రిలిమినరీ “ కీ “నే ఫైనల్ “ కీ “ గా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. 

అభ్యర్థులు తమ యూజర్ నేమ్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి తమకు వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. అభ్యర్థులకు వారు రాసిన షిఫ్ట్ లో వచ్చిన మార్కులు , నార్మలైజేషన్ తర్వాత వారి మార్కులు , గతంలో వారు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసి ఉంటే ఆ వెయిటేజీ మార్కులు కలిపి మొత్తం మార్కులను ఈరోజు వెల్లడించిన ఫలితాలలో అభ్యర్థులు చూడవచ్చు.

ఈ ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లోనే అభ్యంతరాలను ఈనెల 20వ తేదీలోపు తెలుపవచ్చు.

తెలంగాణ మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తన అధికారిక వెబ్సైట్ లో ఇటీవల పోస్టులను పెంచుతూ జోన్లవారీగా ఖాళీలు వివరాలు తెలియజేస్తూ, రిజర్వేషన్లు , రోస్టర్ పాయింట్స్ వివరాలన్నీ తెలుపుతూ , వెబ్ నోటీస్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. 

గత సంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో 5,204 పోస్టులు ఉండగా తాజాగా 1890 పోస్టులను జత చేసి మొత్తం 7,094 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లుగా రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

తాజాగా విడుదల చేసిన వెబ్ నోటీస్ లు మరియు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!