ఇండియన్ ఆర్మీ నుండి మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ( 2023 – 2024 ) నోటిఫికేషన్ విడుదలైంది.
మిలిటరీ నర్సింగ్ సర్వీసులో ఆఫీసర్ స్థాయి ఉద్యోగం పొందాలని కోరుకునే మహిళా నర్సింగ్ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.
ఎమ్మెస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ లేదా బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన మహిళా నర్సింగ్ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు.
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
మిలటరీ అథారిటీ నిర్ణయించిన మిలిటరీ స్టాండర్డ్స్ ప్రకారం మెడికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపిక కావాలంటే పైన పేర్కొన్న విద్యార్థులతో పాటు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అనగా 25-12-1988 నుండి 26-12-2002 మధ్య జన్మించి ఉండాలి.
ఈ పోస్టులకు అర్హులైన వారికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా 2024 లో జనవరి 14న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షలో నర్సింగ్ సిలబస్ , ఇంగ్లీష్ భాష , జనరల్ ఇంటెలిజెన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి..
ఈ పరీక్షలో ఎటువంటి నెగెటివ్ మార్కులు ఉండవు..
పరీక్షలో కనీసం 50% మార్కులు వస్తె క్వాలిఫై అవుతారు…
పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూను ఢిల్లీలో నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క అధికారిక వెబ్సైట్ మరియు వారు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ లో పేర్కొన్న మెయిల్ ను చెక్ చేస్తూ ఉండాలి.
ఇంటర్వ్యూ పూర్తయిన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ మరియు మెడికల్ పరీక్షలు పూర్తవడానికి మూడు నుంచి ఐదు రోజులు సమయం పడుతుంది.
ఈ విధంగా సెలెక్ట్ అయిన వారికి ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క హాస్పిటల్స్ లో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తూ కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది.
ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకునేవారు 2023లో డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ మధ్య ఆన్లైన్ విధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి.
అప్లై చేసే సమయంలో ప్రతి ఒక్క అభ్యర్థిని తప్పనిసరిగా 900 రూపాయలు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.