Headlines

తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త | గత నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు అదనంగా 1890 పోస్టులు కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం | TS Staff Nurse Jobs Increased

తెలంగాణ స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు భారీ శుభవార్త . 5,204 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత , ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 1827 పోస్టులను కలిపి మొత్తం ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నర్సింగ్ అభ్యర్థులు కోరుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకొని గత నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకు అదనంగా 1890 పోస్టులను కలిపి మొత్తం 7,094 అనుమతి ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో తెలంగాణ మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తన అధికారిక వెబ్సైట్ లో పోస్టులను పెంచుతూ జోన్లవారీగా ఖాళీలు వివరాలు తెలియజేస్తూ, రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్ వివరాలన్నీ తెలుపుతూ , వెబ్ నోటీస్ విడుదల చేసింది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీ కోసం 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసి 2023 ఆగస్టు 2వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్షను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించడం జరిగింది.

ఈ పరీక్షను మొత్తం మూడు షిఫ్టుల్లో నిర్వహించారు.

పరీక్ష నిర్వహించిన కొద్ది రోజులకి ప్రిలిమినరీ ” కి ” ని విడుదల చేసిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఫలితాలను అభ్యర్థులకు వచ్చిన మార్కులను కూడా విడుదల చేసింది. 

తాజాగా విడుదల చేసిన వెబ్ నోటీస్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!