ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో జిల్లా కోర్టు నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనో గ్రాఫర్ , అటెండర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 26వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ నోటిఫికేషన్ ద్వారా అనంతపురం జిల్లాలో జిల్లా కోర్టులో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు .
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 03
స్టెనోగ్రాఫర్ – 02
అటెండర్ – 01
🔥 పోస్టుల పేర్లు : స్టెనో గ్రాఫర్ , అటెండర్
🔥 అర్హతలు :
స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేయాలంటే నిరుద్యోగ అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి , దానితోపాటు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎగ్జామినేషన్స్ నుండి ఇంగ్లీషు టైప్ రైటింగ్ లో హయ్యర్ గ్రేడ్ నందు మరియు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత కలిగిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.( షార్ట్ హ్యాండ్ లో హయ్యర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు లేకపోతే లోవర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు .) దీంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్స్ కు సంబంధించిన నైపుణ్యం కలిగి ఉండాలి .
అటెండర్ ఉద్యోగాలకు 7వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు అప్లై చేయాలి. పదో తరగతి ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అర్హులు అవుతారు. కానీ ఉన్నత చదువులు చదివిన వారు ఈ పోస్టులకు అనర్హులు.
డ్రైవింగ్, ఎలక్ట్రికల్, కార్పెంటరి, ప్లంబింగ్, కుకింగ్, వాషింగ్, గార్డెనింగ్ వచ్చిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
జీతం :
స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి – 18,500/-
అటెండర్ ఉద్యోగానికి – 15,000/-
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు 01-07-2023 నాటికి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి . అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీ , బిసి అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు .
ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి .
ఈ పోస్టులకు రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు అప్లై చేయు అభ్యర్థులు దిగువ తెలిపిన సర్టిఫికెట్ల పైన అట్టేస్టేషన్ చేయించి అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ కు అందజేయాలి.
🔥 కావాల్సిన సర్టిఫికెట్స్ :
- అకాడమిక్ , టెక్నికల్ మరియు అభ్యర్థికి సంబంధించిన ఇతర స్కిల్స్ ని తెలిపే సర్టిఫికెట్స్
- పుట్టిన తేదీని ధ్రువీకరించే సర్టిఫికెట్
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కమ్యూనిటీ సర్టిఫికెట్
- ఇతర సంబంధిత సర్టిఫికెట్స్
- గెజిటెడ్ అధికారి చేత అభ్యర్థి యొక్క లేటెస్ట్ ఫోటోగ్రాప్ పైన అట్టేస్టేషన్ చేయించి ఆ ఫోటోను అప్లికేషన్లో ఫోటో అంటించాల్సిన ప్రదేశంలో అంటించాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ , అనంతపురం
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
🔥 Download Notification & Application