ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య , ఆరోగ్య శాఖలో 170 పోస్టుల భర్తీ కోసం రెండు వేరువేరు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉండే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 144 , విశాఖపట్నంలోని విమ్స్ లో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్స్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. పోస్టులను కాంట్రాక్టు మరియు పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
బోధనా ఆస్పత్రిల్లోని వివిధ స్పెషాలిటీల్లో ఖాళీగా ఉన్న 144 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈనెల 18 మరియు 20వ తేదీల్లో విజయవాడలోని డిఎంఈ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ 144 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
ఇక విశాఖపట్నంలోని విమ్స్ లో ఉన్న 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతుల భర్తీ చేస్తున్నారు . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు విశాఖపట్నంలోని విమ్స్ విమ్స్ లో ఈ నెల 15న జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ చూసి ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
ఈ ఉద్యోగాలకు జనరల్ అభ్యర్థులు అయితే గరిష్ట వయస్సు 42 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ, ఎస్టీ , బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
🔥 Official Website – Click here