Headlines

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల | APPSC Group 1 Notification Qualification , Selection Process, Age , Syllabus in Telugu

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వరుసగా నోటిఫికేషన్ విడుదల అవుతూ ఉన్నాయి . ఇప్పటికే 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ తాజాగా 81 పోస్టులతో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 81 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అత్యున్నత స్థాయి పోస్టులైన గ్రూప్ 1 సర్వీసెస్ లో ఉన్న ఖాళీలు భర్తీ కోసం ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లో మొత్తం పోస్టులు 81 ఉన్నాయి .

ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లు 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్ టాక్స్ కమిషనర్ పోస్ట్లు , 26 డిప్యూటీ పోలీస్ సూపర్డెంట్ పోస్ట్లు , ఆర్డీవో , గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఓటిపిఆర్ ను లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయవచ్చు. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఇప్పటి వరకు ఓటిపిఆర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయని అభ్యర్థులు కొత్తగా తమ బయోడేటా వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి ఓటిపిఆర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్లు ఇచ్చిన మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి కి యూజర్ ఐడి పంపించడం జరుగుతుంది.

ఓటిపిఆర్ లాగిన్ ఉన్నవారు ఆ వివరాలుతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ ఉద్యోగాలకు వచ్చే నెల జనవరి 1 నుండి జనవరి 21వ తేదీ మధ్య ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

అలాగే ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించి మెయిన్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

ఈ ప్రిలిమినరీ పరీక్ష 2024లో మార్చి 17వ తేదీన నిర్వహించబోతున్నట్లుగా నోటిఫికేషన్ లో ముందుగానే తెలియజేయడం జరిగింది. మెయిన్స్ పరీక్ష తేదీ వివరాలు తరువాత అధికారిక వెబ్సైట్లో వెల్లడించడం జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష లో  పేపర్ 1 , పేపర్ 2 ఉంటాయి . ప్రతి పేపర్ కు 120 ప్రశ్నలు 120 మార్కులకు ఉంటుంది . 120 నిమిషాల సమయం ఇస్తారు.

మెయిన్స్ పరీక్షలో ఇంగ్లీష్ మరియు తెలుగు సంబంధించిన పేపర్లతో పాటు మరో ఐదు పేపర్లు ఉంటాయి. ఇంగ్లీష్ మరియు తెలుగు సంబంధించిన పేపర్ల పరీక్ష క్వాలిఫై అయితే సరిపోతుంది. మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు . ఇంటర్వ్యూ మార్కులతో కలిపి మొత్తం 825 మార్కులకు ఉంటుంది. 

ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష వివరాలు తర్వాత వెల్లడిస్తారు. 

ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది , మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. 

ప్రిలిమ్స్ లో ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.. ⅓ వంతు నెగెటివ్ మార్కుల విధానము కూడా ఉంది. 

ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన మరికొన్ని రకాల ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్స్ విడుదల చేయబోతుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!