Headlines

257 కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Contract / Outsourcing Jobs New Recruitment Notification 2023

ఆంధ్రప్రదేశ్ లో మరో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ  నోటిఫికేషన్ ద్వారా వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ , జనరల్ డ్యూటీ అటెండెంట్. మార్చురీ అటెండెంట్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , స్టోర్ అటెండర్ వంటి ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ మరియు స్టోర్ కీపర్ వంటి ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉన్న వారు అప్లై చేయవచ్చు. 

ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లో కాంట్రాక్ట్ , మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతి అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు అన్ని ఔట్సోర్సింగ్ ఉద్యోగాలే. ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ అనేవి ఉండవు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ పాడేరు నందు పనిచేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు .

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం ద్వారా కావడం ద్వారా ఎంపిక కావచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు డిసెంబర్ 11వ తేదీ లోపు అప్లై చేయాలి.

ఈ పోస్టులకు ఎంపిక ఆయితే 2024 లో జనవరి 2వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి, నియమాక పత్రాలు అందజేస్తారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్ట్లు:  ఆఫీస్ సబార్డినేట్ , జనరల్ డ్యూటీ అటెండెంట్. మార్చురీ అటెండెంట్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , స్టోర్ అటెండర్ , స్టోర్ కీపర్ తో పాటు మరి కొన్ని రకాల పారామెడికల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

🔥 అర్హతలు : పదో తరగతి , ITI , డిగ్రీ మరియు ఇతర అర్హతలు ఉన్నవారు అర్హులు

🔥 మొత్తం పోస్టులు : 257

ఇందులో కాంట్రాక్టు ఉద్యోగాలు – 116

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – 141

ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది.

🔥 జీతము : 

ఆఫీస్ సబార్డినేట్ , జనరల్ డ్యూటీ అటెండెంట్. మార్చురీ అటెండెంట్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , స్టోర్ అటెండర్ వంటి ఉద్యోగాలకు 15వేల రూపాయల జీతం ఉంటుంది. మిగతా ఉద్యోగాలకు ఇంతకంటే ఎక్కువ జీతమే ఉంటుంది.

🔥 అర్హతలు : పోస్టులు అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.. 

🔥 కనీస వయసు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు . 

ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-12-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 11-12-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు : ఓసి అభ్యర్థులు 250/- ఫీజు చెల్లించాలి.

SC/ ST/ BC అభ్యర్థులకు ఫీజు – 200/-

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి 

🔥 అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా : 

ప్రిన్సిపల్ కార్యాలయం,

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ,

పాడేరు ,

అల్లూరి సీతారామరాజు జిల్లా.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!