కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయిన హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటిలిజెన్స్ బ్యూరో నుంచి 995 పోస్టులతో ఒక బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే లెవెల్-7 పే స్కేల్ ప్రకారం దాదాపు 80 వేలకు పై గానే జీతం వస్తుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ , రైల్వే, బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ పోస్టులకు ప్రిపేర్ అవడం సులభంగా ఉంటుంది.
మొత్తం 995 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో అన్ రిజర్వ్ క్యాటగిరీలో 377 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 129 పోస్టులు, ఓబీసీ రిజర్వేషన్ లో 222 పోస్టులు, ఎస్సీ రిజర్వేషన్ లో 134 పోస్టులు ఎస్టీ రిజర్వేషన్ లో 133 పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు. దివ్యాంగులు ఈ పోస్టులకి అప్లై చేయడానికి అవకాశం లేదు
15-12-2023 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ పోస్టులకి అర్హులు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
భర్త చనిపోయి విడాకులు పొంది తిరిగి పెళ్లి చేసుకొని జనరల్ మహిళలైతే 35 సంవత్సరాలు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు అయితే 40 సంవత్సరాల వరకు కూడా మినహాయింపు ఉంటుంది.
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు 450 రూపాయలు ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు అందరూ చెల్లించాలి. అన్ రిజర్వ్డ్, OBC, EWS కేటగిరి పురుష అభ్యర్థులు పరీక్ష ఫీజు 100 రూపాయలు అదనంగా చెల్లించాలి.
ఈ ఉద్యోగాలు ఎంపిక ప్రక్రియలో నిర్వహించే పరీక్ష తేదీలు ఇంకా ప్రకటించలేదు, అధికారిక వెబ్సైట్లో తరువాత ప్రకటించడం జరుగుతుంది.
ఇక పరీక్ష కేంద్రాలు విషయానికొస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం, చీరాల, గుంటూరు, కడప కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం , విజయనగరంలో ఉంటాయి.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం , మహబూబ్ నగర్ ,వరంగల్ లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.