Headlines

పదో తరగతి అర్హతతో ప్రభుత్వం కళాశాల మరియు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్ , ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేసిన ఉమ్మడి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా 34 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వైద్య , ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా 257 పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ డిపార్ట్మెంట్ అవసరాలు మేరకు ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. 

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు అప్లై చేయాలి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా

🔥 పోస్టుల పేర్లు : రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, అనస్థీషియా టెక్నీషియన్ , ఆడియో విజువల్ టెక్నీషియన్ , ఆడియో మెట్రి టెక్నీషియన్, బయో మెడికల్ టెక్నీషియన్ , కార్డియాలజీ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, డెంటల్ టెక్నీషియన్, ఈసిజి టెక్నీషియన్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఎలక్ట్రిషన్ గ్రేడ్ 3, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్స్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, మార్చురీ అటెండెంట్స్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ సబ్ఆర్డినేట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫిజియోథెరపిస్ట్ , ప్లంబర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, రిఫ్రాక్షనిస్ట్, స్పీచ్ తెరపిస్ట్, స్టోర్ అటెండర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 257

కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలు – 116

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – 141

🔥 అర్హత : 10th , ITI , డిప్లొమా, డిగ్రీ వంటి అర్హతలు తో పాటు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి. ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )

🔥 అప్లికేషన్ ప్రారంభించేది : 01-12-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 11-12-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

🔥 వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా 

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : OC అభ్యర్థులకు 250/- రూపాయలు , 

SC , ST , BC అభ్యర్థులకు – 200/- రూపాయలు

PH అభ్యర్థులకు ఫీజు లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ నింపి అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం , పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!