ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పన్నుల శాఖ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ తిరుపతి జిల్లాలో ఉన్న రీజనల్ జీఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ నుండి విడుదలైంది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ పోస్టులు అన్నింటిని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఏడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు , ఐదు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత తో పాటు కంప్యూటర్ నైపుణ్యం ఉన్నవారు అప్లై చేయవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఏడవ తరగతి పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు.
డేటా ఏంటి ఆపరేటర్ ఉద్యోగాలకి ఎంపిక అయితే 18,500 జీతం, ఆఫీస్ అవార్డినేట్ ఉద్యోగాలకు ఎంపిక అయితే 15,000/- రూపాయలు జీతం ఉంటుంది.
ప్రస్తుతం ఈ పోస్టులన్నీ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ( APCOS) నిబంధనల మేరకు భర్తీ చేస్తారు.
ఈ పోస్టులకు జూలై 31- 2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు వర్తిస్తుంది.
ఈ పోస్టులకు డిసెంబర్ 8వ తేదీలోపు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఈ పోస్టులకు అప్లై చేయు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై అట్టే స్టేషన్ చేయించి అప్లికేషన్ తో పాటు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
రీజనల్ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ , తిరుపతి , 7వ ఫ్లోర్ , A- బ్లాక్ , ది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ , పద్మావతి నిలయం ,తిరుపతి