Headlines

7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు | Andhrapradesh Anganwadi Jobs Recruitment 2023 | AP Latest jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత గ్రామపంచాయతీలో ఉద్యోగం చేసుకునే అవకాశం ఇస్తూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది .ఈ నోటిఫికేషన్ ద్వారా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న మినీ అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడి సహాయకులు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . 

ఈ పోస్టుకు అడుగులైన అభ్యర్థులు నవంబర్ 30వ తేదీలోపు అప్లై చేయాలి.

గతంలో ముఖ్యమంత్రి గారు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సమీక్ష జరిపిన సందర్భంగా ఈ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. 

ప్రస్తుతం మరో జిల్లాలో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ వైయస్సార్ కడప జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేయడం జరిగింది .

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ – నవంబర్ 30 , 2023 .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , వైయస్సార్ కడప జిల్లా

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 21

ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి…

మినీ అంగన్వాడీ కార్యకర్త – 02

అంగన్వాడీ సహాయకులు – 19

🔥 అర్హతలు : 7వ తరగతి

7వ తరగతి చదివిన వారు లేకపోతే తదువరి దిగువ తరగతిలో అత్యధిక అర్హత కలిగిన వారిని తీసుకోవడం జరుగుతుంది.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 30-11-2023

🔥 ఇంటర్వ్యూ తేదీ : 08-12-2023

🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

🔥 గమనిక : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతములలో 21 సంవత్సరాలు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది .

🔥 ముఖ్యమైన విషయాలు : 

✅ అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల /మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు కావలసిన అర్హతలు.

> పైన వుదహరించిన పోస్టుల భర్తీ విషయములో భర్తీ చేయుటకు గాని, నిలుపుటకు గాని, రద్దు పరుచుటకు గాని నియామకపు కమిటీ ఛైర్మన్ వారికి పూర్తి అధికారము కలదని తెలియజేయడమైనది.

> అంగన్వాడీ కార్యకర్తలు /సహాయకుల / మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత మహిళా అభ్యుర్ధుల నుండి సదరు పోస్టుల ఎంపిక కొరకు ధరఖాస్తులను ఆహ్వానించడమైనది.

> 21-35 సంవత్సరముల మధ్య వయస్సు గల వారై వుండవలెను (01.07.2023 నాటికి)

> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహిత మహిళ లై మరియు వారి కుటుంబము సంబధిత గ్రామమునకు చెందిన వారి ఉండవలెను. తదుపరి అభ్యర్థినులు సంబంధిత గ్రామ సమ్మతి కలిగినవారై ఉండవలెను.

> అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు అభ్యుర్థులు 10 వ తరగతి ఉత్తీర్ణులై వుండవలెను. స్కూల్ సర్టిఫికేట్

ఆధారంగా నియామకం జరుగును. విద్యార్హత సర్టిఫికేట్ బట్టి మాత్రమే విద్యార్హత, వయస్సు పరిగణించబడును.

> SC హేబిటేషన్ కు కేటాయించిన పోస్టులలో SC అభ్యుర్ధులచే మాత్రమే భర్తీ చేయబడును.

> ST హేబిటేషన్ కు కేటాయించిన పోస్తులలో ST అభ్యుర్ధుల చే మాత్రమే భర్తీ చేయబడును.

> అంగన్వాడి కార్యకర్తలు/సహాయకుల ఎంపికలో గ్రామము స్థానికతకు ప్రాతిపదికగాను, మున్సిపాలిటీ పరిధిలో వార్డును స్థానికతకు ప్రాతిపదికగా పరిగణించ బడును.

> అభ్యర్ధులు ధరఖాస్తులను సంభంధిత ప్రాజెక్టు కార్యాలయమునందు అనగా సంబంధిత ఐ.సి.డి.ఎస్ కార్యాలయములో పొంది పూర్తి చేసిన తదుపరి ధరఖాస్తులను అక్కడ అందజేసి రశీదును

పొందవలసినదిగా తెలియ జేయడమైనది.

> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులు స్థానికమైనవి. వీటికి బదిలీ నిబంధనలు వర్తించవు.

> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకము పొందుటకు

నిబంధనలతో పాటు సెలక్షన్ కమిటీ తుది నిర్ణయము ప్రకారము ఎంపికలు నిర్వహించబడును.

> కేంద్రము పోస్టు (అంగన్వాడీ కార్యకర్తలు / సహాయకులు / మినీ అంగన్వాడీ కార్యకర్తల) రోస్టరు ప్రకారము ఏకేటగిరికీ వర్తించునో భర్తీ ప్రక్రియలో ఆ కేటగిరీ వారిచే భర్తీ చేయబడును.

> ఎస్.సి / ఎస్.టి. కేంద్రములకు మరియు ఎస్.సి / ఎస్.టి.కేటగిరికి రోస్టరు లో రిజిస్టరు కాబడిన ఎస్.సి / ఎస్.టి. పోస్టులకు 21 సంవత్సరములు నిండిన అభ్యుర్ధులు లేని ఎడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా నియమించబడవచ్చును.

> జి.ఓ.ఏం.ఎస్.నెం.20, తే30.05.2015దీ అనుసరించి , నియమించబడిన అంగన్వాడీ కార్యకర్తలు/ సహాయకులు / మినీ అంగన్వాడీ కార్యకర్తలు 60 సంవత్సరములు నిండిన పిదప విధుల నుండి విరమించవలసి యుండును.. 

🔥 జీతం ఎంత ఉంటుంది : 

అంగన్వాడి కార్యకర్తకు – 11,500/-

అంగన్వాడి సహాయకులకు – 7,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వ్యు నిర్వహిస్తారు .

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం

🔥 ఎలా అప్లై చెయాలి : అర్హత గల వారు మీకు దగ్గరలోని CDPO కార్యాలయంలో సంప్రదించి మీ ప్రాంతంలో ఖాళీలు ఉన్నట్లయితే అక్కడ వారిచ్చిన అప్లికేషన్ తీసుకుని నింపి అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలను జతపరిచి అప్లై చేయవలెను. ( జిల్లా వెబ్సైట్లో కూడా అప్లికేషన్ ఉంది , అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు)

🔥 జతపరచల్సిన సర్టిఫికెట్స్ : 

  1. పుట్టిన తేది / వయస్సు ధృవీకరణ పత్రం
  2. కుల ధృవీకణ పత్రం
  3. విద్యార్హత ధ్రువీకరణ పత్రము – SSC మార్కుల లిస్ట్ , TC మరియు SSC కంటే చదివిన వారు దాన్ని మార్క్ లిస్ట్ మరియు TC జతపరచవలెను.
  4. నివాస స్థల ధ్రువీకరణ పత్రము
  5. వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
  6. వికలాంగులైనచొ పీహెచ్ సర్టిఫికెట్
  7. వితంతువు అయినచో పిల్లలు ఉన్నట్లయితే పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం
  8. ఆధార్ కార్డు
  9. రేషన్ కార్డు

అర్హులేని వారు దరఖాస్తులు నింపి పైన తెలిపిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేయించి సంబంధిత CDPO కార్యాలయంలో అందజేయవలెను.

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!