Headlines

10th అర్హతతో 26,146 పోస్టులు భర్తీ | SSC GD Constable Notification Details in Telugu | Staff Selection Comission GD Constable Recruitment 2023

10th అర్హత గల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది .

10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది .

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో కోరుతున్నారు .

అతి తక్కువ ధరలో SSC GD కానిస్టేబుల్ ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఇంగ్లీష్ , హిందీ తో పాటు స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి తెలుగులో కూడా పరీక్ష రాసుకునే అవకాశం ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది . ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 24న ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 31వ తేదీ లోపు అప్లై చేయాలి .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 26,146

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : 10th పాస్ 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 24-11-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 31-12-2023

✅ పరీక్ష తేదీ : ఫిబ్రవరి / మార్చి (2024) లో నిర్వహిస్తారు . 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 01-01-2024 నాటికి ) 

🔥 గరిష్ట వయస్సు : 23 సంవత్సరాలు  01-01-2024 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : 

  1. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  2. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు

🔥 జీతం : లెవెల్ -3 ప్రకారం Rs. 21,700/- నుండి 69,100/- వరకు ఉంటుంది.

🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . 

అవి చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :

కంప్యూటర్ ఆధారిత పరీక్ష. శారీరక దారుఢ్య పరీక్షలు మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు . 

🔥 పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందీ. ఇందులో ఆబ్జెక్టివ్ విధానంలో 80 ప్రశ్నలు ఉంటాయి . ప్రతీ ప్రశ్నకు 2 మార్కులు ఇస్తారు. 

జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ , జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవెర్నేస్ , ఎలిమెంటరీ మాథెమాటిక్స్ , ఇంగ్లీష్ / హిందీ కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.  

ఈ పరీక్షను మీరు తెలుగు అభ్యర్థులు తెలుగు లో కూడా రాయవచ్చు. 

🔥 ఫీజు : 100/- ( మహిళలు ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు )

🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికి వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాలి

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!