Headlines

AP గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ | AP Grama Sachivalayam AHA Notification 2023 | AP Grama Sachivalayam Animal Husbandry Assistant Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు భర్తీ కోసం తాజాగా 1896 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నుంచి విడుదల చేశారు. 

పశుసంవర్ధక శాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామ సచివాలయాల్లో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

మీ అందరికీ తెలిసిందే , గ్రామ మరియు వార్డు సచివాలయంలో 19 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఈ 19 రకాల ఉద్యోగ ఖాళీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 వేలకు పైగానే ఖాళీలు ఉన్నాయి. 

అయితే ప్రభుత్వం ముందుగా గ్రామ సచివాలయాల్లో ఉండే పశుసంవర్ధక సహాయకుల ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1896 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతుంది. 

ఈ పోస్టులకు భారతీయ పౌరులైన ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న అభ్యర్థులు అర్హులు.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా పాత లేదా ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ జరుగుతుంది అని నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం క్యాటగిరి 1 లో ఉండే ఉద్యోగాలు , డిజిటల్ అసిస్టెంట్ , పశుసంవర్ధక సహాయకులు , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ మరియు టెస్ట్ సీరీస్ ల కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఉన్నవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పశుసంవర్ధక శాఖ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : పశుసంవర్ధక సహాయకులు

మొత్తం పోస్టులు : 1896

ఈ పోస్టుల సంఖ్య రిక్రూట్మెంట్ అవసరాల మేరకు పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంటుంది.

జిల్లాల వారీగా ఖాళీలు ఇవే…👇 👇 👇

🔥 అర్హతలు : 

1) శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి.

 నిర్వహించిన రెండు సంవత్సరాల పశు సంవర్ధక పాలిటెక్నిక్ కోర్సు

2) డైరీయింగ్ మరియు పౌల్ట్రీ సైన్సెస్ ఒక సబ్జెక్టుగా కలిగిన ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు / వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి కి చెందిన రామచంద్రపురం వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నుండి రెండు సంవత్సరాల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు / మల్టీ పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ ( MPVA )రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు.

(GO MS No:34 Dtd.13-09-2013 AHDDF (AHII) లోని నిబంధనల ప్రకారం)

3) డైరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌తో ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు చదువు

4) ఇంటర్మీడియట్ (APOSS) పాడిపరిశ్రమను ఒక వృత్తిపరమైన సబ్జెక్ట్‌గా కలిగి ఉంటుంది.

5) B.Sc (డైరీ సైన్స్)

6) డైరీ సైన్స్‌ ఒక సబ్జెక్టు గా కలిగిన తో BSc

7) MSc (డైరీ సైన్స్)

8) డిప్లొమా వెటర్నరీ సైన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ చదువు

9) బి.టెక్ (డైరీ టెక్నాలజీ)

10) SVVU యొక్క డైరీ ప్రాసెసింగ్‌లో డిప్లొమా

11) వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా , భారత్ సేవక్ సమాజ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరీక్షలు.

12) B.పాడి పరిశ్రమ & పశుసంవర్ధక వృత్తిపరమైన కోర్సు

 “ పై అర్హతలతో ఎంపికైన అభ్యర్థులుకు 4 నెలల డిపార్ట్‌మెంటల్ ఇంటెన్సివ్ స్కిల్-ఓరియెంటెడ్ హ్యాండ్-ఆన్ డిపార్ట్‌మెంటల్ ట్రైనింగ్ పశుసంవర్ధక శాఖ ద్వారా నిర్వహించబడుతుంది”.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 20-11-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 11-12-2023

🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : 27-12-2023

🔥 కంప్యూటర్ పరీక్ష తేదీ : 31-12-2023

🔥 ఫీజు : 

SC , ST , PH , Ex.Service Men అభ్యర్థులకు 500/-

ఇతరులకు 1000/- 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : రెండు సంవత్సరాల ప్రొబిషనరీ కాలం ఉంటుంది. ఈ రెండు సంవత్సరాలు కాలంలో పదిహేను వేల రూపాయల జీతం ఇవ్వబడుతుంది. రెండు సంవత్సరాల ప్రోబేషన్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు రివైజ్డ్ పే స్కేల్ 2022 ప్రకారం జీతం ప్రారంభమవుతుంది. అనగా 22460/ నుండి 72810/- వరకు ఉంటుంది 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 పరీక్ష కేంద్రాలు : అభ్యర్థి ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో మూడు పట్టణాలను ఎంపిక చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న అభ్యర్థుల ఆధారంగా ఈ మూడు పట్టణాల్లో ఒక పట్టణంలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. 

🔥 పరీక్ష విధానము :

Part-A లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు , 50 మార్కులకు ఇస్తారు.

Part-B లో సబ్జెక్టుకి సంబంధించిన వంద మార్కులకు గాను 100 ప్రశ్నలు ఇస్తారు .

ఈ పరీక్ష ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకి ఒక మార్కు ఇస్తారు ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు తగ్గిస్తారు.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం “ INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!