Headlines

ఆంధ్రప్రదేశ్ లో ఔట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ | AP Outsourcing Jobs Recruitment 2023 | APCOS Latest Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ విధానంలో టైపిస్టి కం కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

అలాగే ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రెవిన్యూ శాఖ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ నోటిఫికేషన్ పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.

మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంటుంది.

🔥 అర్హతలు : 

I. కంప్యూటర్‌తో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Tech/BCA/MCA  (లేదా)

ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ తో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి PGDCA సర్టిఫికేట్ మరియు

II. ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ బోర్డు నుండి టైపు రైటింగ్ హైయర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత.

గమనిక : టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు లేని సందర్భంలో లోయర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత పొందిన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

🔥 ఈ ఉద్యోగాలకు ఎంపికైతే 18,500/- జీతం ఉంటుంది.

🔥 ఈ ఉద్యోగాలకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసుగల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ , ఎస్టీ, బీసీ EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు దివ్యంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల నుంచి అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫెషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 30.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!