ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త.
త్వరలో 80,000 కు పైగా ఉద్యోగాలు భర్తీకి విడుదల కాబోతున్న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జీడీ కానిస్టేబుల్ మరియు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు ఉచితంగా శిక్షణ ఇవ్వబోతున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారు
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ ఉచిత శిక్షణకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
రాష్ట్రంలోని విద్యార్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జీడీ, సీఆర్పీఎఫ్ విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అవసరమైన శిక్షణను రాంకీ ఫౌండేషన్, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందిస్తున్నట్టు రాంకీ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంవీ రామిరెడ్డి తెలిపారు. ఆయన దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
సాయుధ బలగాల నియామకంలో భాగంగా త్వరలో 80 వేలకుపై గా కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుందన్నారు.
ఆసక్తి కలిగిన పదో తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 23 ఏళ్లలోపు ఓసీ అభ్యర్థులు, 26 ఏళ్లలోపు ఓబీసీ,
28 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. రాంకీ ఫౌండేషన్-
పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ లు సంయుక్తంగా నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన
600 మంది అభ్యర్థులకు హైదరాబాద్, గుంటూరు(పెదపరిమి గ్రామం) లోని రాంకీ ఫౌండేషన్ నైపుణ్య శిక్షణ కేంద్రాలలో శిక్షణ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 26వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించి, 29న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు.
అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు.
మరింత సమాచారం కోసం 9703651233,
73375 85959, 9000797789 నంబర్ లకు సంప్రదించాలని సూచించారు.