Headlines

AP Government Contract / Outsourcing Jobs Recruitment 2023 | కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం 14 పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు సెలెక్ట్ అయ్యే అభ్యర్థులకు నవంబర్ 30న కౌన్సెలింగ్ నిర్వహించి నియమక పత్రాలు ఇస్తారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇👇

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఉన్న , టీచింగ్ హాస్పిటల్స్ ,  గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 09 నుంచి నవంబర్ 15వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో చాలా రకాల మెడికల్ పోస్టులతో పాటు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. 

🔥 భర్తీ చేసే పోస్టులు : చైల్డ్ సైకాలజిస్ట్ , క్లినికల్ సైకాలజిస్ట్ , సైకియాట్రిక్ సోషల్ వర్కర్ , సైకియాట్రిక్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ , కంప్యూటర్ ప్రోగ్రామర్ , సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ , నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ , ఎలక్ట్రికల్ హెల్పర్ 

🔥 అర్హతలు : 

ఈ పోస్టులకు అర్హతలు క్రింది విధముగా ఉండాలి 👇👇👇

🔥 ఈ పోస్టుకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులవుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు వయసులో వయో సడలింపు ఇస్తారు. 

🔥 ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది..

🔥 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సెలక్ట్ అయ్యే అభ్యర్థులకు జీతము క్రింది విధంగా ఉంటుంది. 

 సైకాలజిస్ట్ – 54,060/-

క్లినికల్ సైకాలజిస్ట్ – 54,060/-

సైకియాట్రిక్ సోషల్ వర్కర్ – 38,720/-

ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ – 40,970/-

కంప్యూటర్ ప్రోగ్రామర్ – 34,580/-

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ – 34,580/-

నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ – 34,580/-

ఎలక్ట్రికల్ హెల్పర్ – 15,000/-

🔥 ఈ పోస్టులకు ఓసి అభ్యర్థులు అయితే 250/- ఫీజు చెల్లించి అప్లై చేయాలి .

మిగతా రిజర్వేషన్స్ కలిగిన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥 ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

🔥 ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ 30వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది.

🔥 ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయనగరం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన అభ్యర్థులకు Acknowledgement ఇవ్వబడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!