Headlines

ఈ నెలలోనే APPSC నుండి 23 నోటిఫికేషన్స్ | APPSC Group 2 Notification 2023 | APPSC Latest News today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ నెలలో 23 నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు తెలిపారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా దాదాపుగా 1603 పోస్టులు భర్తీ చేయబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ శాఖల్లో పలు విభాగాల్లో ఉద్యోగాలు భర్తీకి ఈ నోటిఫికేషన్స్ జారీ చేయబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ తెలిపారు.

ఇందులో గ్రూప్ 1 ఉద్యోగాలు దాదాపు 100 పోస్టులు , గ్రూప్ 2 ఉద్యోగాలు దాదాపు 900 పోస్టులు ఉండబోతున్నాయి. ఈ నోటిఫికేషన్స్ లతోపాటు మరికొన్ని నోటిఫికేషన్స్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇప్పటికే ఈ ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చినట్టు కూడా తెలిపారు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

డిగ్రీ పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ వంటి పోస్టులతో పాటు మొత్తం 23 నోటిఫికేషన్స్ జారీ చేయబోతున్నట్టుగా తెలిపారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని 18 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆయా విశ్వవిద్యాలయాల వారిగా నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయని ఈ పోస్టులు భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుందని డిసెంబర్లోనే ఈ పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా ఏపీపీఎస్సీ చైర్మన్ గారు తెలిపారు. 

గత ఏడాది జారీచేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రక్రియ ఎలాంటి న్యాయవివాదాలకు తావు లేకుండా 11 నెలల్లోనే పూర్తి చేసామని ఈ నెలలో కూడా విడుదల చేయబోయే గ్రూప్ 1 కూడా అదే విధంగా పూర్తి చేస్తామని , పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. గ్రూప్ 1 ఉద్యోగాల పరీక్షల నిర్వహణ , మూల్యాంకనం , సమర్థంగా ఎంపిక , హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు ఒక కొత్త విధానాన్ని రూపొందించినట్లుగా తెలిపారు.

ఇందుకోసం దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలైనా ఐఐటీలు , HCU , రాష్ట్రంలోని యూనివర్సిటీలో నిపుణులైన వారితో చర్చించి సిలబస్ లో మార్పులు తెస్తున్నట్లు తెలిపారు. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇవే 👇👇👇👇

గ్రూప్-2 – 900

గ్రూప్-1 – 89+

(క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కలిపి మొత్తం 100 వరకు)

లైబ్రేరియన్స్ ఇన్ ఏపీ కాలేజీ ఎడ్యుకేషన్ – 23 

డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ – 267

ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ జేఎల్స్ – 100 

ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ డీఎల్స్ – 05

టీటీడీ డీఎల్స్, జేఎల్స్ – 78 

ఇంగ్లిష్ రిపోర్టర్స్(ఏపీ లెజిస్లేచర్ సర్వీస్) – 10

జూనియర్ లెక్చరర్స్ (లిమిటెడ్) – 47

అసిస్టెంట్ కెమిస్ట్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ – 01

జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ – 06 

అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్ – 03

అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ – 01

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ – 04 

సంక్షేమశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్స్ – 02

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్(కేటగిరి-2) – 1

సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్(కేటగిరి-3) – 04

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్(కేటగిరి-4) – 06

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ – 38

ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ – 04 

జూనియర్ అసిస్టెంట్స్ (జైళ్లు) – 1

పాలిటెక్నిక్ లెక్చరర్స్ – 99

లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ – 02

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!