Headlines

ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల్లో 3,220 పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల | AP University’s Professor , Assistant Professor , Associate Professor Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 యూనివర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. 

రాష్ట్రంలో ఉన్న 18 విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ , అసిస్టెంట్ , అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ యూనివర్సిటీల వారీగా విడుదల చేయడం జరిగింది. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 యూనివర్సిటీల్లో 278 బ్యాక్లాగ్ , 2,942 రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం యూనివర్సిటీల నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యాయి .

ఈ పోస్టుల్లో ప్రొఫెసర్ పోస్టులు 418 , అసోసియేట్ ప్రొఫెసర్లు 801 , ట్రిపుల్ ఐటీల లెక్చరర్ పోస్టులతో కలిపి సహాయ ఆచార్య పోస్టులు 2,001 ఉన్నాయి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ఈ పోస్టులకు నవంబర్ 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం నవంబర్ 30వ తేదీ నాటికి సహాయ ఆచార్య పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల యొక్క జాబితాను వర్సిటీ లు ప్రకటిస్తాయి.

ఈ జాబితా పై డిసెంబర్ 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ 8న తుది జాబితాను విడుదల చేస్తాయి. 

ఈ పోస్టులకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది.

అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ పోస్టులకు పరీక్ష ఉండదు.

అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు 3,000/- రూపాయలుగా నిర్ణయించారు. ఎన్ని పోస్టులకు అర్హత ఉంటే అన్ని పోస్టులకు వేరువేరుగా అప్లై చేయాలి.

కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు 2,500/- రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు అయితే 2,000/- ఫీజు చెల్లించాలి.

స్క్రీనింగ్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్లో నిర్వహిస్తుంది. ఇందులో మొత్తం 15 ప్రశ్నలు మూడు గంటలు సమయం ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి ప్రశ్నకి మూడు మార్కులు , ప్రతి తప్పు సమాధానానికి ఒక మైనస్ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు , అకాడమిక్ మార్కుల ప్రాధాన్యంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!