Headlines

APSRTC నుండి 6 జిల్లాల్లో ఖాళీల భర్తీ | APSRTC Apprentice posts Recruitment 2023 | APSRTC Notification 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది .

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు . తాజాగా విడుదలైన మరో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ప్రింట్ అవుట్ ని తీసుకుని నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన రెజ్యూమ్ కూడా నింపి అవసరమైన అన్ని ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతపరిచి అప్లికేషన్ ను  సంబంధిత కార్యాలయం అడ్రస్ కు పంపించడం ద్వారా అప్లై చేయాలి .

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ఏ.పి.యస్.ఆర్.టి.సి. నందు అప్రింటిన్షిప్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరచిన ట్రేడ్ల నందు IT.I ఉత్తీర్ణులైన వారు 15.11.2023 వ తేదీ లోగా ఆన్లైన్ లో వెబ్ సైట్ అడ్రస్ నందు దరఖాస్తు చేసుకొన వలసినదిగా తెలియజేయడమైనది.

15.11.2023 వ తేది తదుపరి తేదిలలో దరఖాస్తు చేసుకొన్న వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో పరిగణనలోకి తీసుకొనబడవు.

ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ కర్నూలు లోని జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల నుండి విడుదలైంది. 6 జిల్లాల్లో అప్రెంటీస్ ఖాళీలను చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య – 309

కర్నూలు – 49

నంద్యాల – 50 

అనంతపురం – 52

శ్రీ సత్యసాయి – 40 

కడప – 67 

అన్నమయ్య – 51

అభ్యర్థులు క్రింద తెలిపిన సూచనలను చదివి వాటిని తప్పక పాటించవలసినదిగా కోరడమైనది.

1 ) కర్నూలు , నంద్యాల , అనంతపురం , శ్రీ సత్యసాయి , కడప , అన్నమయ్య జిల్లాల నందు వున్న ITI ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు  . డీజల్ మెకానిక్ , మోటార్ మెకానిక్ , ఎలక్ట్రిషన్ , వెల్డర్ , పెయింటర్ , డ్రాఫ్ట్మెన్ సివిల్ , మేషనిస్ట్ , ఫిట్టర్ ట్రేడ్ లలో ఐటీఐ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు 

2) I.T.I ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి పూర్తి వివరములను ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు నమోదు చేసుకొన్న తర్వాత వారు వెబ్ సైట్ నందు “login” అయ్యి వారు అప్రెంటిసెప్ చేయదలచుకున్న జిల్లా ను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలెను. 

3) ఏ.పి.యస్.ఆర్.టి.సి నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు ఎ.పి.యస్.ఆర్.టి.సి జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల, కర్నూల్ నందు హాజరు కావలసియుండును. 

వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ.118/- రుసుము చెల్లించవలెను. వెరిఫికేషన్ జరుగు తేది దినపత్రిక ల ద్వారా తెలియజేయబడును.

4) సర్టిఫికేట్స్ మరియు నకళ్ళు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెనువెంటనే ఈ క్రింద తెలిపిన certificates యొక్క నకలును మా కార్యాలయమునకు 16.11.2023 తేదీలోగా చేరునట్లు పంపవలసినదిగా కోరడమైనది. 

సర్టిఫికేట్స్ ను పంపునపుడు తగిన విదముగా పూర్తి

చేసిన “RESUME” తో పాటుగా క్రింద ఇవ్వబడిన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను పంపవలెను. 

S.S.C Marks list.

I.T.I. Marks (Consolidated Marks Memo)

NCVT Certificate

కుల ధృవీకరణ పత్రము – SC/ST/BC ( పర్మినెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రము)

వికలాంగులైనచో ధృవీకరణ పత్రము

మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము

NCC మరియు Sports ఉన్నచో సంబంధిత ధృవీకరణ పత్రములు మరియు ఆధార్ కార్డు

Certificates నకళ్ళు పంపవలసిన చిరునామా:-

ప్రిన్సిపల్

జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్

APSRTC

బళ్ళారి చౌరస్తా , కర్నూలు ( PO మరియు జిల్లా )

ఈ నోటిఫికేషన్ తో పాటు అభ్యర్థి ” RESUME” నమూనా జతచేయడమైనది. అభ్యర్థులు Resume నకలును print తీసుకొని. అందులోని అన్ని వివరములు పొందుపరచవలెను. Certificates తో పాటు ‘Resume” జత చేసి పైన తెలిపిన చిరునామా కు పోస్ట్ ద్వారా పంపవలెను.

ఇంటర్వ్యూ కు హాజరైనపుడు అభ్యర్థులు పైన తెలిపిన తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఒక జత నకలు తీసుకు రావలెను.

ముఖ్య గమనిక :

1) ఆన్ లైన్ నందు 15.11.2023వ తేది లోగా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను. ఆన్ లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును. వేరే ఏ మాధ్యము ద్వారా సమర్పించినను స్వీకరించబడవు.

2) ఆన్లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డును తప్పనిసరిగా నమెదు చేయవలెను (EKYC) మరియు ఆధార్ కార్డు లో వున్న వివరములు సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి వివరములతో సరిపోవలెను.

3) పోర్టల్ నందు అప్రెంటిసెప్ కొరకు అప్లై చేయునపుడు ఏమైనా సందేహములు వున్న ఎడల మీరు మీ ITI కాలేజి నందు సంప్రదించవచ్చును.

4) ఏదైనా సందేహము వున్న ఎడల Phone No. 08518-257025 , 7382869399 , 7382873146 లకు ఆఫీసు సమయములో మాత్రమే అనగా ఉ: 10.00 గంటల నుండి సా:05.00 గంటల వరకు సంప్రదించవలసినదిగా కోరడమైనది.

5) ఈ ప్రకటన మీకు దగ్గరలోని డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటిసు బోర్డు నందు కూడా చూడవచ్చు.

ఈ ప్రకటన APSRTC website www.apsrtc.ap.gov.in నందు కూడా చూడవచ్చు.

🔥 Download Notification 

🔥 Apply Link 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!