ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. నవంబర్ లోపు భారీగా పారామెడికల్ ఉద్యోగాలు భర్తీకి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పోస్టులు భర్తీకి చాలా నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి.
ఈ పోస్టులు జిల్లా స్థాయి మరియు రాష్ట్రస్థాయిలో వివిధ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయబోతున్నారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రులు, వైద్య, నర్సింగ్ కళాశాలల్లో పారామెడికల్, నాన్-క్లినికల్ సహాయ సిబ్బంది పోస్టులన్నీ నవంబర్
నెలాఖరులోగా భర్తీ చేయాలని సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్ ను ఆదేశిస్తూ డైరెక్టర్ ఆఫ్.మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరసింహం గారు ఉత్తర్వులిచ్చారు. బోధనాస్పత్రి, వైద్య, నర్సింగ్ కళాశాలలన్నింటికీ కలిపి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) ద్వారా కంబైన్డ్ నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.
అలాగే ప్రభుత్వ రంగంలో 17 కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే 5 కళాశాలలు ప్రారంభమయ్యాయి. మరో 5 కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభంకానున్నాయి. ఆయా కళాశాలలకు కొత్తగా పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితోపాటు, ఇప్పటికే ఉన్న పాత కళాశాలలు, బోధనాస్పత్రుల్లో 1800 వరకూ పారామెడికల్, నాన్-క్లినికల్ సహాయ సిబ్బంది పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయ నున్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా అన్ని పోస్టులు భర్తీ చేయాలి అంటూ ముఖ్యమంత్రి గారు గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటి వరకూ 53 వేల పోస్టులను ఒక్క వైద్య శాఖలోనే భర్తీ చేశారు. ఉద్యోగ విరమణలు, ఇతరత్రా కారణాలతో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడే భర్తీ చేసుకునేలా అత్యవసర ఉత్తర్వులిచ్చారు .
కాబట్టి ఈ పోస్టుల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతున్నాయి.