Headlines

గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకు నవంబర్ నోటిఫికేషన్ – డిసెంబర్లో పరీక్ష | AP Grama Sachivalayam 3rd Notification 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలు భర్తీకి సంబంధించిన 3వ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉన్నారు .

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గ్రామ మరియు వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో 1.34 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు .

గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల పోస్టులను భర్తీ చేశారు.

మొదటి నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాని ఉద్యోగాల భర్తీ కోసం మరోసారి రెండవ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు .

రెండో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత భర్తీ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ కొన్ని పోస్టులు మిగిలిపోవడం జరిగింది.

అంతేకాకుండా కొంతమంది ఉద్యోగులు మరణించడం , గ్రామ సచివాలయు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి అంతకంటే మంచి జీతం వచ్చే ఉద్యోగాలు రావడం వంటి వివిధ కారణాల వలన  ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలోనే ఖాళీలు ఉన్నాయి .

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. ఈ క్లాసులు అన్ని అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే చెప్పించడం జరిగింది.

📌 Download Our APP

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

గత కొద్దిరోజులు క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టులో ప్రస్తుతం ముందుగా 1,896 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు .

ఈ 1,896 పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన పశుసంవర్ధక సహాయక పోస్టులు.

ఈ 1,896 పశుసంవర్ధక సహాయక పోస్టులకు నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ అప్పలరాజు గారు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇప్పటివరకు తొలి విడతలో 3,033 , రెండో విడతలో 1,619 పశుసంవర్ధక సహాయక పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు.

ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించమని త్వరలో భర్తీ చేయబోయే 1,896 పోస్టుల భర్తీ కూడా పూర్తి పారదర్శకంగా చేపడతామని తెలిపారు. 

ఈ 1,896 పోస్టుల భర్తీకి నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని , డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఇదే వెబ్సైట్ లో అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. 

🔥 మరి కొన్ని ఉద్యోగాల సమచారం కోసం మా   ” INB jobs info “ యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేసుకోండి.. అలాగే మా Telegram ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!