ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త..
అక్టోబర్ 20వ తేదీన 3,282 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది…
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది
ఈ పోస్టులను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 3282 అధ్యాపకు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఉన్నతం విద్యా మండలి చైర్మన్ కే.హేమచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .
వీటితో పాటు డిప్యూటేషన్ పై మరో 70 పోస్టులను భర్తీ చేస్తామని కూడా తెలిపారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ , అసోసియేట్ ప్రొఫెసర్ వంటి వివిధ పోస్టుల భర్తీ కోసం కసరత్తు జరుగుతున్నట్టుగా తెలిపారు.
యూనివర్సిటీలో ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీకి గతంలో ఎప్పుడూ నోటిఫికేషన్ విడుదల చేయలేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలను పటిష్టం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు .
యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ విషయంలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి 10% వెయిటిజి మార్కులు కల్పిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో యూనివర్సిటీలో సుమారు 2,600 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో బోధిస్తున్నారని తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి ఒక పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తారు . వారి నుంచి అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఒక పోస్ట్ కు నలుగురిని ఎంపిక చేస్తారు.
ఈ పోస్టుల కు రాత పరీక్ష ఏపీపీఎస్సీ నిర్వహించే అవకాశం ఉంది.
యూనివర్సిటీలో బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రస్తుతం రేషనలైజేషన్ జరుగుతోందని తెలిపారు.
ఈ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇదే వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మా వెబ్సైట్ ని తరుచుగా ఓపెన్ చేస్తూ ఉండండి.