తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TSGENCO)లో 339 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) మరియు 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్లు విడుదల చేసింది .
ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులు 187, ఏఈ (మెకానికల్) పోస్టులు 77, ఏఈ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు 25,
ఏఈ (సివిల్) పోస్టులు 50 కలిపి మొత్తం 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏఈ మరియు కెమిస్టు పోస్టులకు అక్టోబర్ నెల 7 నుంచి 29 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఈ రెండు రకాల పోస్టులకు డిసెంబర్ 3న రాతపరీక్ష జరగనుంది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వి భాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన వారు ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టులకు, సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉన్న వారు ఏఈ (సివిల్) పోస్టులకు, మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉన్న వారు ఏఈ (మెకానికల్) పోస్టులకు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్స్ట్రూమెంటేషన్ కంట్రోల్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్/ఇన్స్ట్రూమెంటేషన్ అండ్ పవర్/పవర్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ కలిగిన అభ్యర్థులు ఏఈ (ఎలక్ట్రానిక్స్) పోస్టుకు అర్హులు.
కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో ప్రథమ శ్రేణి ఎంఎస్సీ డిగ్రీ కలిగిన వారు కెమిస్ట్ పోస్టులకు అర్హులు అవుతారు.
🔥 Download Notification – Click here