ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 434 పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ , విజయవాడ నుండి విడుదల చేయడం జరిగింది.
నోటిఫికేషన్ ద్వారా 434 స్టాఫ్ నర్స్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిక్స్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు , ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం మరియు అప్లై చేసే విధానం ఇలా ఉన్నాయి.
▶️ పోస్టుల పేరు : స్టాఫ్ నర్స్
▶️ పోస్టుల సంఖ్య : 434
జోన్ -1 లో 86 పోస్టులు
జోన్ – 2 లో 220 పోస్టులు
జోన్ – 3 లో 34 పోస్టులు
జోన్ – 4 లో 94 పోస్టులు ఉన్నాయి..
▶️ ఏ జోన్ లో ఏ జిల్లాలు ?
జోన్ – 1 లో శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం
జోన్ – 2 లో తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి , కృష్ణ
జోన్ – 3 లో గుంటూరు , ప్రకాశం , నెల్లూరు
జోన్ – 4 లో చిత్తూరు , కర్నూలు , కడప , అనంతపురం
▶️ అర్హత : జిఎన్ఎమ్ లేదా బిఎస్సి నర్సింగ్
▶️ ఫీజు :
ఓసి అభ్యర్థులకు 500/- రూపాయలు
ఎస్సీ , ఎస్టీ , బీసీ మరియు దివ్యంగులైన అభ్యర్థులకు 300/- రూపాయలు
▶️ ఫీజు చెల్లించే విధానం : డీడీ రూపంలో
ముఖ్యమైన తేదీలు: 👇 👇👇
▶️ అప్లికేషన్ ప్రారంభ తేదీ :
సెప్టెంబర్ 21-2023 ఉదయం 10 గంటల నుండి
▶️ అప్లికేషన్ చివరి తేదీ :
అక్టోబర్ 5 – 2023 సాయంత్రం 5 గంటల లోపు
▶️ గరిష్ట వయసు : 42 సంవత్సరాలు (01-07–2023 నాటికి )
▶️ ఎంపిక విధానం : అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కులు, గతంలో పనిచేసిన అనుభవం వంటి ఆధారంగా
▶️ అప్లై చేయు విధానం : ఆఫ్లైన్ లో
ఈ పోస్టులను జోన్లవారీగా భర్తీ చేస్తున్నారు , కాబట్టి అర్హులైన అభ్యర్థులు తమకు జోన్ కి చెందిన రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ యొక్క కార్యాలయంలో అప్లికేషన్ స్వయంగా వెళ్లి అందజేయాలి.
నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు , మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
🔥 Download Notification & Application