ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త , మినీ అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడి సహాయకుల ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .
నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుండి 09 రోజుల్లోగా ఈ పోస్టులకు అప్లై చేయాలి..
గతంలో ముఖ్యమంత్రి గారు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సమీక్ష జరిపిన సందర్భంగా ఈ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి .
ప్రస్తుతం మరో జిల్లాలో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ శ్రీకాకుళం జిల్లాలోని 16 ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేయడం జరిగింది .
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబరు 30 , 2023 .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , శ్రీకాకుళం జిల్లా
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 51
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి…
ఆమదాలవలస – 03
ఎచ్చెర్ల – 03
గార – 03
నరసన్నపేట – 07
లావేరు- 01
శ్రీకాకుళం – 01
కోటబొమ్మాళి – 05
కొత్తూరు – 03
జలుమూరు – 01
పాతపట్నం – 01
టెక్కలి – 05
ఇచ్చాపురం – 06
కాశీబుగ్గ – 02
మందస – 02
సోంపేట – 06
🔥 అర్హతలు : 10వ తరగతి
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 22-09-2023
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 30-09-2023
🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు
🔥 గమనిక : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతములలో 21 సంవత్సరాలు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది .
🔥 ముఖ్యమైన విషయాలు :
✅ అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల /మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు కావలసిన అర్హతలు.
> పైన వుదహరించిన పోస్టుల భర్తీ విషయములో భర్తీ చేయుటకు గాని, నిలుపుటకు గాని, రద్దు పరుచుటకు గాని నియామకపు కమిటీ ఛైర్మన్ వారికి పూర్తి అధికారము కలదని తెలియజేయడమైనది.
> అంగన్వాడీ కార్యకర్తలు /సహాయకుల / మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత మహిళా అభ్యుర్ధుల నుండి సదరు పోస్టుల ఎంపిక కొరకు ధరఖాస్తులను ఆహ్వానించడమైనది.
> 21-35 సంవత్సరముల మధ్య వయస్సు గల వారై వుండవలెను (01.07.2023 నాటికి)
> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహిత మహిళ లై మరియు వారి కుటుంబము సంబధిత గ్రామమునకు చెందిన వారి ఉండవలెను. తదుపరి అభ్యర్థినులు సంబంధిత గ్రామ సమ్మతి కలిగినవారై ఉండవలెను.
> అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు అభ్యుర్థులు 10 వ తరగతి ఉత్తీర్ణులై వుండవలెను. స్కూల్ సర్టిఫికేట్
ఆధారంగా నియామకం జరుగును. విద్యార్హత సర్టిఫికేట్ బట్టి మాత్రమే విద్యార్హత, వయస్సు పరిగణించబడును.
> అంగన్వాడీ సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై వుండవలెను.
> SC హేబిటేషన్ కు కేటాయించిన పోస్టులలో SC అభ్యుర్ధులచే మాత్రమే భర్తీ చేయబడును.
> ST హేబిటేషన్ కు కేటాయించిన పోస్తులలో ST అభ్యుర్ధుల చే మాత్రమే భర్తీ చేయబడును.
> అంగన్వాడి కార్యకర్తలు/సహాయకుల ఎంపికలో గ్రామము స్థానికతకు ప్రాతిపదికగాను, మున్సిపాలిటీ పరిధిలో వార్డును స్థానికతకు ప్రాతిపదికగా పరిగణించ బడును.
> అభ్యర్ధులు ధరఖాస్తులను సంభంధిత ప్రాజెక్టు కార్యాలయమునందు అనగా సంబంధిత ఐ.సి.డి.ఎస్ కార్యాలయములో పొంది పూర్తి చేసిన తదుపరి ధరఖాస్తులను అక్కడ అందజేసి రశీదును
పొందవలసినదిగా తెలియ జేయడమైనది.
> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులు స్థానికమైనవి. వీటికి బదిలీ నిబంధనలు వర్తించవు.
> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకము పొందుటకు
నిబంధనలతో పాటు సెలక్షన్ కమిటీ తుది నిర్ణయము ప్రకారము ఎంపికలు నిర్వహించబడును.
> కేంద్రము పోస్టు (అంగన్వాడీ కార్యకర్తలు / సహాయకులు / మినీ అంగన్వాడీ కార్యకర్తల) రోస్టరు ప్రకారము ఏకేటగిరికీ వర్తించునో భర్తీ ప్రక్రియలో ఆ కేటగిరీ వారిచే భర్తీ చేయబడును.
> ఎస్.సి / ఎస్.టి. కేంద్రములకు మరియు ఎస్.సి / ఎస్.టి.కేటగిరికి రోస్టరు లో రిజిస్టరు కాబడిన ఎస్.సి / ఎస్.టి. పోస్టులకు 21 సంవత్సరములు నిండిన అభ్యుర్ధులు లేని ఎడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా నియమించబడవచ్చును.
> జి.ఓ.ఏం.ఎస్.నెం.20, తే30.05.2015దీ అనుసరించి , నియమించబడిన అంగన్వాడీ కార్యకర్తలు/ సహాయకులు / మినీ అంగన్వాడీ కార్యకర్తలు 60 సంవత్సరములు నిండిన పిదప విధుల నుండి విరమించవలసి యుండును..
🔥 జీతం ఎంత ఉంటుంది :
అంగన్వాడి కార్యకర్తకు – 11,500 రూపాయలు
మినీ అంగన్వాడి కార్యకర్తకు – 7,000/-
అంగన్వాడి సహాయకులకు – 7,000/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వ్యు నిర్వహిస్తారు .
🔥 ఫీజు : లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి
🔥 ఎలా అప్లై చెయాలి : అర్హత గల వారు మీకు దగ్గరలోని CDPO కార్యాలయంలో సంప్రదించి మీ ప్రాంతంలో ఖాళీలు ఉన్నట్లయితే అక్కడ వారిచ్చిన అప్లికేషన్ తీసుకుని నింపి అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలను జతపరిచి అప్లై చేయవలెను.
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here