Headlines

AP ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాల వారీగా ఖాళీలు ఇవే | AP DSC Notification Vacancies List | AP DSC Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో 8,366 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది . 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన ఉపాధ్యాయులు పోస్టులు మరియు ఖాళీలు వివరాలు చెప్పాలని శాసనమండలిలో పిడిఎఫ్ సభ్యులు కే స్ లక్ష్మణరావు , ఐ వెంకటేశ్వరరావు , షేక్ షాబ్జి మరియు టిడిపి సభ్యులు అశోక్ బాబు , భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి , దువ్వారపు రామారావు , వేపాడ చిరంజీవి రావు , బి తిరుమల నాయుడు విడివిడిగా శాసనమండలిలో అడిగారు.

దీనికి సమాధానంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సమాధానమిచ్చారు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . ( 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ )

📌 Download Our APP

విద్యాశాఖ మంత్రి చెప్పిన వివరాలు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,88,162 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు అయ్యాయని, వీటిలో 1,69,642 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పారు .

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 8,366 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.

2019 నుండి 14,129 మంది ఉపాధ్యాయులు ను నియమించామని చెప్పారు .

అయితే రాష్ట్రంలో 20వేల నుంచి 25 వేల వరకు ఉపాధి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ విడుదల చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు.

అలాగే రాష్ట ముఖ్యమంత్రి గారు గతంలో హామీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కూడా కోరారు.  రాష్ట్రంలో గ్రూప్ 1 ,  గ్రూప్ 2 , గ్రూప్ 3 , గ్రూప్ 4 ఖాళీలు మొత్తం 40,000 వరకు ఉన్నాయని . ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కేస్ లక్ష్మణరావు గారు డిమాండ్ చేయడం జరిగింది.

జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

శ్రీకాకుళం – 126 

విజయనగరం – 65

విశాఖపట్నం – 334

తూర్పుగోదావరి – 1221

పశ్చిమగోదావరి – 448

కృష్ణ – 43

గుంటూరు – 507

ప్రకాశం – 415

నెల్లూరు – 340

చిత్తూరు – 818

కడప – 401

కర్నూలు – 3442

అనంతపురం – 206

🔥 మరి కొన్ని ఉద్యోగాల సమచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేసుకోండి.. అలాగే మా Telegram ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి..

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!