Headlines

గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ ఎప్పుడు ? | AP Grama Sachivalayam 3rd Notification Update | AP Grama Sachivalayam Vacancies

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలు భర్తీకి సంబంధించిన 3వ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉన్నారు .

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గ్రామ మరియు వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో 1.34 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు .

గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల పోస్టులను భర్తీ చేశారు.

మొదటి నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాని ఉద్యోగాల భర్తీ కోసం మరోసారి రెండవ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు .

రెండో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత భర్తీ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ కొన్ని పోస్టులు మిగిలిపోవడం జరిగింది.

అంతేకాకుండా కొంతమంది ఉద్యోగులు మరణించడం , గ్రామ సచివాలయు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి అంతకంటే మంచి జీతం వచ్చే ఉద్యోగాలు రావడం వంటి వివిధ కారణాల వలన  ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలోనే ఖాళీలు ఉన్నాయి .

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి .

📌 Download Our APP

గత కొద్దిరోజులు క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ గెజిట్ నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇలా ఉన్నాయి . 👇

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,026 పోస్టులు ఉన్నట్లుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేసింది .

ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న ఖాళీల్లో కొన్ని పోస్టులు కరోనా కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం కల్పించాలని ఈ గెజిట్ స్పష్టం చేయడం జరిగింది .

కరోనా మహమ్మారితో మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో కొందరికి ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం

నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్రెడ్డి గారు కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు జారీచేశారు. 

రాష్ట్రంలో ఇలా మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లోని వారికి ఇప్పటివరకు 1,488 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన 1,149 మంది దరఖాస్తుదారులకూ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తర్వులు పోస్టుల భర్తీకి టైం లైన్లు నిర్ణయించి ఆగస్టులోగా నియామకాలు పూర్తి చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది .

దీనికి సంబంధించిన సమ్మతి నివేదికను సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాలి అని కూడా స్పష్టం చేసింది .

ఈ విషయంలో విద్యార్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆయన ఆదేశించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు

సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేకప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు

తీసుకోవాలని సీఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. గతంలో విడుదల చేసిన గజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ సెప్టెంబర్ లోపు ఈ ప్రక్రియ అంత పూర్తి కావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో గ్రామ మరియు వార్డు సచివాలయం ఉద్యోగాలకు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు మూడవ నోటిఫికేషన్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు.

గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోస్టులను భర్తీ చేసినందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నోటిఫికేషన్ ఇప్పటివరకు విడుదల కాలేదు.

ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు అధికారులు ఖాళీల వివరాలు సేకరిస్తున్నట్లు గతంలో వెల్లడించడం జరిగింది. ఖాళీలు వివరాలు సేకరించినప్పటికీ కూడా ఇప్పటికీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మూడవ నోటిఫికేషన్ విడుదల కాలేదు.

గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు అనే ప్రశ్నకు అధికారుల వద్ద కూడా సమాచారం లేదు అని చెప్పొచ్చు.

నోటిఫికేషన్ అవుతుండడం వలన అర్హత గల నిరుద్యోగులు వయోపరిమితి కూడా మించిపోతుంది .

అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ , గ్రూప్ 1 , గ్రూప్ 2 , డిజిటల్ లైబ్రరీల్లో ఉద్యోగాలు కు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు.

ఇప్పటికే విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా నత్తనడకన నడుస్తుందని చెప్పొచ్చు.

పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రిలిమ్స్ పరీక్షను అతి త్వరగా నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ , అంతే తొందరగా ప్రిలిమ్స్ ఫలితాలను కూడా వెల్లడించింది.

అయితే ఆ తరువాత నిర్వహించవలసిన శారీరక దారుఢ్య పరీక్షలు మరియు మెయిన్స్ పరీక్షల కు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎక్కువ సమయం తీసుకుంటుంది.

ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగాలకు అప్లై చేసి ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు త్వరగా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ను కోరుకుంటున్నారు.

ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ , వార్డు సచివాలయం ఉద్యోగాల నోటిఫికేషన్ తో పాటు మిగతా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. 

🔥 మరి కొన్ని ఉద్యోగాల సమచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేసుకోండి.. అలాగే మా Telegram ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి..

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!