నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..
ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న యువత కు ఉచితంగా శిక్షణ ఇచ్చి , శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగం కూడా కల్పిస్తున్నారు..
పేద నిరుద్యోగ అభ్యర్థులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీస్ , గ్రూప్ 2 , నర్సింగ్ ఉద్యోగాలకు కోచింగ్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేయండి.
ఈ ఉచిత శిక్షణ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ జిల్లా గన్నవరం మండలం లోని సూరంపల్లి లో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) సంస్థలో యువతకు పోలిమర్స్ టెక్నాలజీలో ఉపాధి తో కూడిన ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సీపెట్ జాయింట్ డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ సీహెచ్ శేఖర్ చెప్పారు.
ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ సంయుక్త సౌజన్యంతో ఓబీసీ, ఎస్సీ , తరగతులకు చెందిన 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు గల నిరుద్యోగ యువతకు మెషిన్ ఆపరేటర్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్, మెషిన్ ఆపరేటర్
అసిస్టెంట్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ కోర్సుల్లో ఆరు నెలల శిక్షణతో పాటు ప్రముఖ ప్లాస్టిక్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలిపారు.
శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, ట్రైనింగ్ కిట్, యూనిఫాం, సేఫ్టీ షూస్ అందిస్తామన్నారు.
వివరాలకు కె. సుందరరావు, ఫోన్ నంబర్ 9398050255 లో సంప్రదించి దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.
మరి కొన్ని ఉద్యోగాల సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here