Headlines

తెలుగు వస్తే అప్లై చేయండి | RBI Assistant Jobs Recruitment 2023 | RBI Assistant Jobs Syllabus , Qualification, Apply Process

డిగ్రీ అర్హత గల నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది .

డిగ్రీ అర్హత తో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది .

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 450 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ లో కోరుతున్నారు .

పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుంది..

ఈ నోటిఫికేషన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ యొక్క కార్యాలయాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు . 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో  నిర్వహిస్తున్నారు . 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది .

ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 4వ తేదీ లోపు అప్లై చేయాలి .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 450 పోస్టులు 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : డిగ్రీ 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 13-09-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 04-10-2023

🔥 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 21-10-2023

🔥 మెయిన్స్ పరీక్ష తేదీ : 02-12-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : 

ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు

దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి .

అవి చీరాల , గుంటూరు , కాకినాడ ,  కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :

ప్రిలిమినరీ పరీక్ష మెయిన్స్ పరీక్ష మరియు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు

🔥 పరీక్ష విధానం : 

ప్రిలిమ్స్ పరీక్షలో 100 ప్రశ్నలు ఇస్తారు , వంద మార్కులకు నిర్వహిస్తారు .

60 నిమిషాల సమయం ఉంటుంది

మెయిన్స్ పరీక్షలో 200 ప్రశ్నలు ఇస్తారు , 200 మార్కులకు నిర్వహిస్తారు .

135 నిమిషాల సమయం ఉంటుంది.

🔥 ఫీజు : మహిళలు ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 50 రూపాయలు చెల్లించాలి.

జనరల్ , ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ , అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజు చెల్లించాలి

🔥 అప్లికేషన్ విధానం :  అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అప్లై లింక్ – క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!