Headlines

AP లో గ్రూప్ 1 ,2 ఉద్యోగాల భర్తీ | APPSC Group 2 Vacancies List | AP Group 2 update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో 89 గ్రూప్ 1 , ఉద్యోగాలు మరియు 508 గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది .

గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగాలు కలిపి మొత్తం 597 పోస్టులు భర్తీ కోసం సోమవారం ఈ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది .

ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు .

వ్యవసాయ శాఖ , సహకార శాఖ , బీసీ సంక్షేమం శాఖ , ఆర్థిక శాఖ , హోం మంత్రిత్వ శాఖ ,  మున్సిపల్ శాఖ , రెవిన్యూ శాఖ , సాంఘిక సంక్షేమ శాఖ , రహదారులు భవనాలు శాఖలో 89 గ్రూప్ 1,  ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు .

రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక శాఖ , సాధారణ పరిపాలన శాఖ , న్యాయ శాఖ మరియు వివిధ శాఖల్లో గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు .

గ్రూప్ 1 లో అత్యధికంగా హోం శాఖలో డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 పోస్టులు ( 25 ) ఉన్నాయి .

గ్రూప్ టు లో అత్యధికంగా రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు (161) ఉన్నాయి .

సంబంధిత శాఖలు ఈ పోస్టులకు సంబంధించిన జోన్లవారీగా మరియు జిల్లాల వారీగా ఖాళీలు సమాచారంతోపాటుగా రోస్టర్ పాయింట్లు మరియు విద్యాలత వివరాలు ఏపీపీఎస్సీకి పంపించాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది .

🔥 Download Official G.O

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!