ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో 300 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలి .
నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఆరోగ్య వైద్య, శాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 5, 7, 10 తేదీల్లో ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 5వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 7వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ENT, పాథాలజీ, 10వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీల వారీగా ఇంటర్వ్యూలుంటాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రెగ్యులర్ (లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యులను నియమించనున్నారు. వివరాలకు http://hmfw.ap.gov.in/ వెబ్సైట్ను, 6301138782 అనే నెంబర్ ను సంప్రదించొచ్చు.
🔥 Official Website – Click here