Headlines

TS MPHA Exam Date | TS ANM Exam Date | Telangana MPHA Exam Date | TS MHSRB MPHA Vacancies update

తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి జూలై 26వ తేదీన విడుదల చేసిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు అనుబంధంగా మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు .

దీని ద్వారా గతంలో పేర్కొన్న పోస్టులకు అదనంగా కొన్ని పోస్టులను కలిపి పోస్టుల సంఖ్య పెంచారు .

గతంలో 1520 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొనగా తాజాగా 1931 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లుగా పేర్కొనడం జరిగింది .

అంటే మొత్తం 411 పోస్టులను పెంచారు. 

411 పోస్టులలో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి చెందిన పోస్ట్లు 146 కాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కి చెందిన 265 పోస్టులను కూడా కలిపారు .

ఈ ఉద్యోగాలకు గతంలో గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు ఉండగా ఇప్పుడు 49 సంవత్సరాల వరకు పెంచారు.

ఈ పోస్టులు ఎంపిక ప్రక్రియలో భాగంగా పరీక్షను నవంబర్ 10వ తేదీన (2023) నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా వెల్లడించడం జరిగింది. 

ఈ పరీక్షను ఓఎంఆర్ విధానంలో లేదా కంప్యూటర్ బేస్డ్ విధానంలో తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో నిర్వహిస్తారు .

గతంలో పరీక్షకు 80 పాయింట్లు అనుభవం యొక్క వెయిటేజీకి 20 పాయింట్లు కేటాయించగా ఇప్పుడు పరీక్షకు 70 పాయింట్లు అనుభవం కు 30 పాయింట్లు కేటాయించారు .

  1. అభ్యర్థులు గిరిజన ప్రాంతాల్లో పనిచేసినట్లైతే ప్రతి ఆరు నెలలకి 2.5 మార్కులు ఇస్తారు .
  1. అభ్యర్థులు గిరిజన ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో పనిచేసిన అనుభవం ఉంటే ప్రతి ఆరు నెలలకి రెండు మార్కులు కేటాయిస్తారు .
  2. కనీసం ఆరు నెలలు పనిచేసిన అనుభవం ఉంటేనే ఈ వెయిటేజీ మార్కులు కలపడం జరుగుతుంది .

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 19 వరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు చెందిన అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ వీడియో చూడండి – Click here 

🔥 అఫీషియల్ వెబ్సైట్ – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!