Headlines

APSRTC లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతి | డ్రైవర్స్ , కండక్టర్స్ , కానిస్టేబుల్స్, మెకానిక్ పోస్ట్లు భర్తీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 1539 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది . ఈ 1539 పోస్టులను మూడు దశలలో భర్తీ చేస్తారు . ఈ పోస్టులు అన్నింటినీ కారుని నియామకాలు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది .

సర్వీసులో ఉండగా మరణించిన ఆర్టీసీ సిబ్బంది కల్పిస్తూ అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించనున్నారు. 2016 నుంచి 2020 జనవరి వరకు మృతి చెందిన 311 మంది ఆర్టీసీ సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అనుమతించారు. ఆ ఉద్యోగాలను భర్తీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం వారికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

తాజాగా 2020 జనవరి 1 నుంచి ఇప్పటివరకు మరణించిన ఆర్టీసీ సిబ్బంది వారసులకు కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈమేరకు రెండో విడత కారుణ్య నియామకాలకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది.

2020 జనవరి 1 నుంచి 2023 ఆగస్టు 15.వరకు 1,538 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. ఆయా కుటుంబాల్లో అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద మూడు దశల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు.

మొదటి దశలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా కమిటీలు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఆయా జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయాలు , ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీరిని నియమిస్తారు . జిల్లా కమిటీలు భర్తీ చేయాల్సిన పోస్టుల్లో వీరు నియమించగా మిగిలిన వారికి ఆర్టీసీలో పోస్టింగ్ ఇస్తారు . అప్పటికి అర్హులు మిగిలిపోతే వారికి మళ్లీ జిల్లా కమిటీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారు .

ఇప్పటికే మొదటి దశలో కారుణ్య నియామకాలు కింద ఉద్యోగాలు కల్పించారు మళ్లీ ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తుంది .

కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఆగస్టు 15వ తేదీ వరకు ఉన్న ఖాళీలను ఆర్టిసి సేకరించింది

రాష్ట్రంలో 12 ఆర్టీసీ రీజియన్ల వారీగా మొత్తం 715 ఉద్యోగాలను గుర్తించారు. వీటిలో డ్రైవర్ పోస్టులు 346, కండక్టర్ పోస్టులు 90, అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు 229, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టులు 50 ఉన్నాయి. కారుణ్య నియామకాల కింద ఈ పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!